పార్లమెంటులో దారుణం చోటు చేసుకుంది. దురుసు ప్రవర్తనతో ఇప్పటికే పీకల్లోతు వివాదంలో కూరుకుపో్యిన శివసేన ఎంపీ వ్యవహారం దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుంటే.. తాజాగా ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రితో సహా ఎంపీలంతా కలిసి వేసిన వీరంగం షాకింగ్ గా మారింది. సభలో కేంద్రమంత్రిపై శివసేనకు చెందిన కేంద్రమంత్రి.. మిగిలిన ఎంపీలు చుట్టుముట్టి దాడికి ప్రయత్నించటం సంచలనంగా మారింది.
ఎయిరిండియా ఉద్యోగిపై శివసేన ఎంపీ గైక్వాడ్ చెప్పుతో కొట్టిన ఉదంతంతో.. ఆయన్ను విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించటం తెలిసిందే. ఈ అంశంపై ఈ రోజు లోక్ సభలో చర్చ జరిగింది. గైక్వాడ్ మాట్లాడిన తర్వాత ఈ అంశంపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతుండగా సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీలు.. అశోక్ గజపతి రాజు వైపుకు దూసుకెళ్లారు. ఆయన్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కేంద్రమంత్రి అనంత్ గీతె కూడా ఉన్నారు. వ్యవహారం ముదిరి.. మరోదిశగా వెళుతుందన్న విషయాన్ని గుర్తించిన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ.. అహ్లువాలియాలు అనంత్ గీతెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు.
ఊహించని రీతిలో జరిగిన ఈ వ్యవహారంతో వెంటనే స్పందించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. జరిగిన ఘటనపై స్పీకర్ సుమిత్రా మహాజగన్.. మంత్రులు రాజ్ నాథ్.. అశోక్ గజపతి రాజులు సమావేశమయ్యారు. తప్పు చేసింది కాక.. ఆ తప్పును సమర్థించుకోవటం ఒక ఎత్తు అయితే.. ఒక కేంద్రమంత్రిపై మరో కేంద్ర మంత్రి చేయి చేసుకునే ప్రయత్నం చేయటం.. దానికి శివసేన ఎంపీలు మద్దతు పలకటం గమనార్హం. శివసేన ఎంపీలు అశోక్ గజపతిపై దూసుకెళుతున్న వైనాన్ని గుర్తించి.. టీడీపీ ఎంపీలు ఆయన వద్దకు చేరుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/