తాము అభిమానించే వారి కోసం అభిమానులు ఎలా స్పందిస్తారో తెలియంది కాదు. తాము అభిమానించే వారి కోసం దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటారు కొందరు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం కూడా అలాంటిదే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే ఆ కుర్రాడికి అంతులేని అభిమానం. తాను అభిమానించే జగన్ ను స్వయంగా కలవాలి.. మాట్లాడాలన్నదే అతడి కోరిక. అంతా బాగానే ఉంది కానీ.. జగన్ మీదున్న అభిమానంతో ఏం చేయకూడదో ఆ పని చేశాడు. ఏడో తరగతి చదివే ఆ కుర్రాడు ఊహించని సాహసాన్ని చేశాడు. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దవరంకు చెందిన ప్రసాద్ అనే ఈ కుర్రాడు ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ కు చేరుకున్నారు.
రైల్వే స్టేషన్ నుంచి వాళ్లను.. వీళ్లను అడుగుతూ జగన్ నివాసానికి చేరుకున్నాడు. తాను కర్నూలు నుంచి వచ్చానని జగన్ ను కలవాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. వారు కుదరటానికి ససేమిరా అన్నారు. అయినప్పటికీ ఆ కుర్రాడు జగన్ ఇంటి నుంచి కదలకుండా అలా ఉండిపోయాడు. ఈ కుర్రాడి గురించి వివరాలు తెలుసుకున్న జగన్.. మరో ఆలోచన చేయకుండా వెంటనే ప్రసాద్ ను తన దగ్గరకు పిలిపించుకున్నారు.
ఎల్లల్లేని అభిమానంతో తాను అభిమానించే నాయకుడు తనను స్వయంగా పిలవటమే కాదు.. తనతో ఫోటో దిగి.. ఆ ఫోటో ఫ్రేమ్‌ను కట్టించి బహుబతిగా ఇచ్చారు. అదే సమయంలో అతగాడి సాహసం గురించి తెలుసుకున్న జగన్.. ఇంట్లో వారికి చెప్పకుండా అలా చేయకూడదన్న మాటల్ని ఆ పిల్లాడికి చెప్పి.. వారి ఇంట్లో వారికి పిల్లాడు తన దగ్గర క్షేమంగా ఉన్నాడన్న సమాచారాన్ని అందజేశారు.
ఎంతో శ్రమకోర్చి వచ్చిన పిల్లాడిని రెండు రోజుల పాటు ఉంచేశారు. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రసాద్ ను క్షేమంగా ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేసి పంపారు. ఒక నాయకుడి కోసం ఏడో తరగతి చదివే కుర్రాడు.. ఇంట్లో వారికి చెప్పకుండా జగన్ ఇంటికి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/