స్వరూపానంద సరస్వతికి ఇదేం రోగం

Update: 2016-10-16 09:59 GMT
ఎవరి నమ్మకాలు వారివి. ఆ నమ్మకాలకు లేనిపోని రంగులు అద్దేసి.. ప్రజల మనసుల్ని కలుషితం చేయటం ఏ మాత్రం సరికాదు. ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా తప్పు పట్టాల్సిందే. బలంగా వ్యతిరేకించాల్సిందే. ఫలానా మతం వారు ఫలానా వారిని మాత్రమే పూజించాలనటం ఏ మాత్రం సరికాదు. ఒక హిందువు నమ్మకంగా దర్గాకు వెళ్లటం మర్చిపోకూడదు. ఈ విలక్షణతే భారత్ ను మిగిలిన దేశాలకు భిన్నంగా ఉంచుతోంది.

దేవుడనేవాడు ఉన్నాడా? లేడా? అన్నది పక్కన పెడితే.. నా నమ్మకానికి నచ్చినట్లుగా నా దేవుడ్ని ఎవరో ఒకరిలో చూసుకోవటం తప్పేమిటన్న వాదనను తప్పు పట్టానికి మించిన పెద్ద తప్పు ఉండదు. హిందువుల్లో అత్యధికులు షిర్డీసాయిబాబాను ఎంతగానో కొలుస్తారు. దేశంలో ప్రతి గ్రామంలో షిర్డీ సాయి ఆలయాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి. సాయిబాబాగా కొలిచే వ్యక్తి ముస్లిం కాబట్టి.. ఆయన పూజలకు పనికి రాడని చెప్పటంలో అర్థం లేనిది.

ఎవరికి నచ్చినట్లుగా వారు పూజించే అంశాన్ని వివాదాస్పదంగా మార్చేసి.. లేనిపోని మాటలతో మనసుల్ని కలుషితం చేసే వైనం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. తాజాగా ద్వారకా శారదా పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి కొత్త వాదనను వినిపిస్తున్నారు. షిర్డీ సాయిబాబా ఒక ముస్లిం తెగకు చెందిన వ్యక్తి కాబట్టి.. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలామంది హిందువులు తప్పు చేస్తున్నారని.. ఆయన చిత్రపటాలకు పూజ గదిలో ఉంచుకోవద్దంటూ సెలవిస్తున్నారు.

ఇక్కడితో ఆగక తాజాగా అనంతపురం వచ్చిన ఆయన.. కొంతమంది భక్తులతో తాము ఇలా చేయమంటూ వారి చేత ప్రమాణం చేయించటం వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమాన్నిఅక్కడున్న కొందరు సాయి భక్తులు వ్యతిరేకించటంతో ఇదో వివాదంగా మారింది. శాంతిని పెంచుతూ.. ప్రేమను పెంచే ప్రయత్నం చేయాల్సిన స్వాములోరు.. ఇలా ఉద్రికత్తల్ని పెంచేలా వ్యవహరించటం ఏమిటి..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News