తెలంగాణలోని ఉమ్మడి కరీం నగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వాస్తవానికి కొన్నాళ్లుగా అధికార పార్టీ .. టీఆర్ ఎస్, ప్రతిపక్షం బీజేపీలుఇక్కడ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా నేపథ్యంలో నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో కొంత మందకొడి వాతావరణం కనిపించింది.అయితే.. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో మళ్లీ ఇక్కడ దూకుడు పెరిగింది.
ఇక, అధికార టీఆర్ ఎస్.. సహా.. బీజేపీ.. హుజూరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక, మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం గమనార్హం. మరోవైపు.. బీఎస్పీ కూడా పుంజుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీలో చేరడంతో ఊపు పెరిగింది. అయితే.. ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తుందా..? చేయదా? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇంకా బీఎస్పీ ఒక నిర్ణయానికి రాలేదు.
ఇదిలావుంటే.. ఇటీవలే పురుడు పోసుకున్న షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇప్పటికే హుజూరాబాద్ విషయంపై స్పష్టత ఇచ్చేసింది. తాము ఇక్కడ నుంచి పోటీ చేసేది లేదని.. ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ ఉప ఎన్నిక కేవలం.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన ఇగో సమస్యతో వచ్చిందని.. ఆమె కామెంట్లు కూడా చేశారు. అయితే.. షర్మిల ఇప్పుడు.. హుజూరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉప ఎన్నిక వేడితో అట్టుడుకుతున్న హుజూరాబాద్లో.. షర్మిల రంగ ప్రవేశం చేయనున్నారు.
దీనికి కారణం.. ఉప ఎన్నికలో ప్రచారం కోసం కాదు.. అంతకు మించి.. ఎవరి తరఫునో వకాల్తా పుచ్చుకున్నట్టు కూడా కాదు. కేవలం ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత .. కేసీఆరకు వ్యతిరేకంగా.. ఆమె ఇక్కడ నిరుద్యోగ దీక్షను చేపట్టనున్నారు. ఉప ఎన్నికలో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు. చిత్రం ఏంటంటే.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే షర్మిల.. ఈ నిర్ణయం తీసుకోవడం.
దీనికి సంబంధించి వైఎస్సార్ టీపీ.. నాయకుడు బొమ్మా.. భాస్కరరెడ్డి.. షర్మిల నిరుద్యోగ దీక్షకు సంబం ధించిన ప్రకటనను జారీ చేశారు. ప్రభుత్వంలో కొన్ని వేల ఖాళీలు ఉన్నప్పటికీ.. టీఆర్ ఎస్ ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా.. నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తోందని.. అందుకే నిరుద్యోగులు ఆత్మహ త్యల బాట పడుతున్నారని.. ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షర్మిల.. నిరుద్యోగ దీక్షకు కూర్చుంటున్నారని భాస్కరరెడ్డి తెలిపారు.
అయితే. హుజూరాబాద్‌లోనే ఎందుకు చేయాల్సి వస్తోందో కూడా భాస్కరరెడ్డి వివరించారు. ఇక్కడ దీక్ష చేయడం వల్ల.. రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం వెళ్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో .. యువత, నిరుద్యోగులు.. విద్యార్థి సంఘాల నుంచి.. అప్లికేషన్లను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప పోరులో పాల్గొనేందుకుఎవరికి ఆసక్తి ఉంటే.. వారు పాల్గొనాలని అందులో పేర్కొన్నారు. హుజూరాబాద్ లోనిరుద్యోగులను భారీ సంఖ్యలో నిలబెట్టడం ద్వారా.. కూడా అధికార పార్టీకి నిరుద్యోగ సెగతగిలేలా చేయాలనేది.. షర్మిల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.