మోడీ అండ్ కోకు షాట్‌ గ‌న్ షాకింగ్ మాట‌లు

Update: 2015-11-18 09:59 GMT
గ‌త కొద్దికాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. బీజేపీ అధినాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న షాట్ గ‌న్ శత్రుఘ్న‌సిన్హా మ‌రోసారి చెల‌రేగిపోయారు. త‌న‌నే కాదు..త‌న‌కు తోడుగా ఉండే పార్టీ ఎంపీ ఆర్కే సింగ్ మీద చ‌ర్య‌లు తీసుకునే స‌త్తా ఎవ‌రికీ లేద‌ని తేల్చేశారు. తామిద్ద‌రి మీద చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ము.. ధైర్యం.. అధికారం.. పార్టీలోని ఏ నేత డీఎన్ ఏలోనూ లేద‌ని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నిక‌ల వైఫ‌ల్యాన్ని స‌మిష్టిగా పంచుకోవాల‌న్న మాట‌ను త‌ప్ప ప‌ట్టిన ఆయ‌న‌.. వైఫ‌ల్యానికి ఎవ‌రైతే కార‌ణ‌మో వారే.. ఓట‌మి కార‌ణాలు చెప్పాలన్నారు.

మోడీ అండ్ కో మీద ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన నేత ఇప్ప‌టివ‌ర‌కూ లేరు. అందుకు భిన్నంగా శ‌త్రుఘ్న‌సిన్హా గ‌త కొద్ది కాలంగా త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క్రిమిన‌ల్స్ కు టిక్కెట్లు ఇచ్చారంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం.. దానికి ప్ర‌తిగా  బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి రామ్ లాల్ వారికి స‌మ‌న్లు జారీ చేయ‌టం తెలిసిందే.

బీహార్ ప‌రాజ‌యానికి కార‌ణాలు చెబుతూ.. స్థానికుల్ని ప‌క్క‌న పెట్టి..స్థానికేత‌రుల్ని ప్ర‌చారంలోకి దింప‌ట‌మే ఓట‌మికి కార‌ణంగా విశ్లేషించారు. మోడీ నాయ‌క‌త్వానికి స‌వాలు విసురుతూ.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తున్న షాట్ గ‌న్ కు మోడీ ప‌రివారం చెక్ చెబుతుందా?  చూస్తూ ఉంటుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. త‌మ మీద చ‌ర్య‌లు తీసుకునే ధైర్యం బీజేపీలోని ఏ నేత డీఎన్ ఏలో లేద‌న్న మాట‌కు మోడీ త‌న చేత‌ల‌తో స‌మాధానం ఇస్తారా?
Tags:    

Similar News