రాజ్‌ కుంద్రాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై శిల్పా వివరణ

Update: 2021-11-15 04:55 GMT
రాజ్ కుంద్రా - శిల్పాశెట్టికి కష్టాలు ఆగడం లేదు. భార్యాభర్తలిద్దరూ ప్రారంభించిన ఫిట్‌నెస్ వెంచర్‌లో ఆర్థిక వ్యత్యాసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టారు.ఇప్పుడు ఈ వివాదంపై శిల్పా శెట్టి స్పందించారు.

ఈ జంట తమ పాన్-ఇండియా ఎంటర్‌ప్రైజ్ కోసం భారతదేశం అంతటా పెట్టుబడిదారులు ఆహ్వానించారు. చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అయితే రాజ్ కుంద్రా-శిల్పాశెట్టిలు డబ్బు తీసుకున్నారని పలువురు కేసులు పెట్టారు. రూ. 1.5 కోట్ల చెల్లింపును తనకు ఇచ్చేయాలని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ దంపతులు తనను బెదిరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

దీనిని గమనించి శిల్పా-కుంద్రాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  ఒక వివరణను జారీ చేసింది.  చట్ట పరిధిలో తన పౌర హక్కులను బాగా కాపాడాలని బహిరంగ విజ్ఞప్తి చేసింది. నటి తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఆమె ఈ ఎఫ్ఐఆర్ పై స్పందించింది. "రాజ్ కుంద్రా-నా పేరు మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో షాక్ అయ్యాను!! రికార్డును సరిదిద్దడానికి, ఎస్.ఎఫ్ఎల్ ఫిట్‌నెస్, కాషిఫ్ ఖాన్ నిర్వహిస్తున్న వెంచర్ అది అని పేర్కొంది.

"తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఎల్ ఫిట్‌నెస్ జిమ్‌లను తెరవడానికి బ్రాండ్ ఎస్.ఎఫ్ఎల్ ఫిట్‌నెస్ పేరు పెట్టే హక్కులు తీసుకున్నాడు. అన్ని ఒప్పందాలు అతనితో కుదిరాయి.   బ్యాంకింగ్ & రోజువారీ వ్యవహారాలలో సంతకం చేసాడు. అతని గురించి మాకు తెలియదు. లావాదేవీలు లేదా మేము అతని నుండి ఒక్క రూపాయి కూడా స్వీకరించలేదు." అని శిల్పాశెట్టి వివరణ ఇచ్చింది.

"అన్ని ఫ్రాంచైజీలు నేరుగా కాషిఫ్‌తో వ్యవహరించాయి. కంపెనీని 2014లో మూసివేశారు. పూర్తిగా కాషీఫ్ ఖాన్‌చే నిర్వహించబడింది. నేను గత 28 సంవత్సరాలుగా చాలా కష్టపడి పనిచేశాను.  నా పేరు & ఇమేజ్ దెబ్బతింటోంది. నన్ను ఈ వివాదం లోకి లాగడం నాకు బాధ కలిగించింది.  భారతదేశంలో చట్టాన్ని గౌరవించే గర్వించదగిన పౌరుడిగా నా హక్కులు రక్షించబడాలి. శిల్పాశెట్టి కుంద్రా కృతజ్ఞతలతో అంటూ "శిల్పాశెట్టి ముగించారు.
Tags:    

Similar News