‘‘ఇది తెలంగాణ రాష్ట్రం.. ఇక్కడ పనిచేయాలి.. పైసలు తీసుకోవాలి.. అంతుకానీ కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు సంఘాల పేరిట ఉద్యోగాలు చేయకపోతే నడవదు..’’ అని తేల్చిచెప్పేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆర్టీసీపై ఉక్కుపాదం మోపి కార్మిక సంఘాల నేతలకు ఉన్న అదర్ డ్యూటీ (పనిచేయకున్నా జీతాలు ఇచ్చే సౌకర్యం) ఎత్తివేశారు. దీంతో కార్మిక నేతలు డ్యూటీల్లో చేరారు. వారిని తాజాగా చెట్టుకొకరిని.. పుట్టకొకరని బదిలీ చేశారు. పనిచేయకపోతే ఉద్యోగాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాత్రం ఆరు నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు.
ఇక ఉద్యోగ, ఉపాధ్యాయులపై కూడా కేసీఆర్ కొరఢా ఝలిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదర్ డ్యూటీ సౌకర్యం కట్ చేశారు. ఇన్నాళ్లు పనిచేయకుండా సంఘాల పేరిట రాజకీయం చేసిన వారిని ఉద్యోగాల్లో చేరాలని ఆదేశించారు. లేకపోతే పోస్టులు ఊడిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేశారు. దీంతో చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు డ్యూటీల్లో చేరిపోయారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నేతలకు అదర్ డ్యూటీ కల్పించే సౌకర్యాన్ని కేసీఆర్ సర్కారు రద్దు చేసి వారందరికీ షాకిచ్చింది. ఆర్టీసీపై ఉక్కుపాదం తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా కేసీఆర్ మార్క్ షాక్ తగిలింది. ఉద్యోగులకు అదర్ డ్యూటీ ఫైల్ ను కేసీఆర్ ఆమోదించకుండా పక్కనపడేశారు. దీంతో ఇప్పుడు అందరు ఉద్యోగ సంఘాల నేతలు తప్పనిసరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి ఏపీలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ అదర్ డ్యూటీ సౌకర్యంతో కార్మిక, ఉద్యోగ నేతలు వారి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. ఇప్పుడా పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది. అదర్ డ్యూటీని తీసేసి ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ గట్టి షాకే ఇచ్చారు. ఇక ఉద్యోగులు, కార్మికులు తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడేలా ఉక్కుపాదం మోపేశారు.