రీల్ కాదు రియల్: బట్టల రామస్వామి బయోపిక్ లో మాదిరే

Update: 2021-05-17 02:18 GMT
రెండు.. మూడు రోజుల క్రితమే బట్టల రామస్వామి బాయోపిక్ పేరుతో ఒక చిన్న సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది. విడి రోజుల్లో అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోరేమో కానీ.. లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టని వేళ.. ఏదైనా కొత్త సినిమా చూద్దామన్న మూవీ లవ్వర్స్ కు ఈ సినిమా కాసింత సరదాగానే అనిపించింది. విశేషం ఏమంటే.. ఈ సిన్న సినిమాలోని ఒక సీన్ యథాతధంగా రియల్ గా చోటు చేసుకోవటం ఆసక్తికరమని చెప్పాలి. సాధారణంగా రీల్ సీన్లు రియల్ గా చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా ఈ సినిమాలో సీన్ మాదిరే.. రియల్ గా చోటు చేసుకోవటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

మానసికంగా మందబుద్ది ఉన్న తన చెల్లెల్లి పెళ్లి చేసుకోవాల్సిందేనని భర్తను పట్టుబట్టి మరీ పెళ్లి చేసే సీన్ బట్టల రామస్వామి బయోపిక్ మూవీలో కనిపిస్తుంది. సరిగ్గా ఇదే తీరుతో కర్ణాటకలోని కోలారు జిల్లాలో చోటు చేసుకుంది. వేగమడుగు గ్రామానికి చెందిన సుప్రియ.. లలితలు అక్కాచెల్లెళ్లు. సుప్రియకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకకున్నా.. చెల్లెలు లలిత మాత్రం పుట్టుకతోనే మాట్లాడలేదు.. వినలేదు. దీంతో.. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారా? అని తెగ బాధ పడేది.

తాజాగా సుప్రియకు ఉమాపతి అనే కుర్రాడితో పెళ్లి నిశ్చితమైంది. సరిగ్గా పెళ్లి ముహుర్తం ముంచుకొచ్చిన వేళ.. కాబోయే భర్తకు కొత్త కండిషన్ పెట్టింది సుప్రియ. తనను పెళ్లి చేసుకోవాలంటే తన చెల్లెల్ని కూడా పెళ్లాడాల్సిందేనని పట్టుబట్టింది. అందుకు ఉమాపతి ససేమిరా అన్నాడు. దీంతో.. విషయం పెద్దల వరకు వెళ్లింది. చివరకు అమ్మాయే అంతలా పట్టుబడుతున్నప్పుడు.. మగాడివి.. నీకేం అంటూ సర్దిచెప్పటంతో చెల్లెల్ని కూడా పెళ్లాడాడు ఉమాపతి. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు ట్విస్టు ఏమంటే.. పెళ్లి ముచ్చట అధికారులకు తెలీటం.. వారు రంగ ప్రవేశం చేసి.. లలితకు పద్దెనిమిదేళ్లు దాటలేదని.. మైనర్ అని తేల్చారు. చట్టవిరుద్దంగా పెళ్లి చేసుకున్నందుకు ఉమాపతిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి షాకింగ్ ట్విస్టులతో ఈ పెళ్లి ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News