అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆ మధ్యన జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. తన బలగాల్ని భారీగా మొహరించి మరీ విజయాన్ని పార్టీ ఖాతాలోకి చేర్చిన వైనం తెలిసిందే. నిజానికి ఈ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడటమే కాదు.. పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన పరిస్థితి. తెలంగాణ పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ సీటును చేజార్చుకోవటానికి మించిన పెద్ద దెబ్బ కాంగ్రెస్ కు మరేం ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ ఏరి కోరి మరీ ఎంపిక చేసి బరిలోకి దింపిన అభ్యర్థి సైదిరెడ్డి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో.. ఆయన పేరు రాష్ట్రంలో అందరికి సుపరిచితులుగా మారారు. అయితే..తర్వాతి కాలంలో ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడటం.. పెద్ద ఎత్తున నెగిటివ్ కథనాల్ని ప్రసారం చేయటంతో పాటు.. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. అధికారుల నిర్లక్ష్యం.. అలక్ష్యం బట్టబయలు అయ్యేలా కథనాల్ని ప్రసారం చేస్తుందన్న పేరున్న ఒక ఛానల్ హుజూర్ నగర్ లో పబ్లిక్ డిబేట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఈ రోజు (ఆదివారం) నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డికి వ్యతిరేకంగా చేపట్టినదిగా ప్రచారం సాగింది.
ప్రోగ్రాంకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. వందలాది మంది వేదిక మీదకు దూసుకొచ్చిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇలా దూసుకు వచ్చిన వారంతా టీఆర్ఎస్ కార్యకర్తలు.. సానుభూతిపరులుగా చెబుతున్నారు. తమపై దాడి జరిగినట్లుగా సదరు చానల్ ఆరోపిస్తోంది. తమపై జరిగిన దాడి వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైది రెడ్డి ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము నిర్వహించే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డిని కూడా ఆహ్వానించామని.. కానీ ఆయన రాలేదని చెబుతున్న సదరు చానల్ సిబ్బంది.. ఇలా తమ వర్గీయుల్ని ఉసిగొల్పటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు.
తమ చానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొని సమాధానాలు చెప్పలేక.. తాను చేసిన తప్పులు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతోనే తమపై దాడి జరిగినట్లుగా ఆరోపిస్తున్నారు. స్టేజ్ మీదకు దూసుకొచ్చిన వారు.. చర్చా కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. చానల్ కు సంబంధించిన లైవ్ వైర్లను తెంచేయటంతోపాటు.. సదరు చానల్ కు చెందిన కెమేరామెన్లపై దాడి చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇలాంటి ఉదంతం చోటు చేసుకోలేదని చెబుతున్నారు.
చానల్ లైవ్ ఎక్విప్ మెంట్.. వాహనాల్ని కూడా ధ్వంసం చేశారని.. హుజూర్ నగర్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారే తప్పించి.. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతంపై వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న సైదిరెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఏమైనా.. అధికారపార్టీ ఇమేజ్ ను తాజా ఉదంతం డ్యామేజ్ చేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది.