కాంగ్రెస్‌ లో చేరిన బీజేపీ మాజీ ఎంపీ

Update: 2016-11-28 14:32 GMT
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ తన భర్త వ్యవస్థాపకుడిగా ఉన్న ఆవాజ్‌- ఏ- పంజాబ్‌ ను కాదని కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌ దీప్ సర్జేవాలా సమక్షంలో నవజ్యోత్ కౌర్ సిద్దూ శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ అమృత్‌ సర్ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్ తెలిపారు. పార్టీని కేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. భ‌ర్త సిద్దూతో నవజ్యోత్ కౌర్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ లో బీజేపీని వీడిన నవజ్యోత్‌ కౌర్ కాంగ్రెస్‌ లో చేరడాన్ని పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ స్వాగతించారు. భావ సారూప్యత ఉన్న నవజ్యోత్‌ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడిందని అన్నారు. కాగా, సెప్టెంబర్‌ లో కొత్త రాజకీయ పార్టీని పెట్టిన సిద్ధూ ఆపై ఎన్నికలే తమ లక్ష్యమని ఓసారి ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించారు. అనంత‌రం ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మరోసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, నవజ్యోత్ కౌర్‌ తరువాత, సిద్ధూ కూడా కాంగ్రెస్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధూ పార్టీ మారడంపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News