శిల్పా రాజీనామాతో టీడీపీకి షాక్ త‌ప్ప‌దా?

Update: 2017-08-15 10:02 GMT
టీడీపీ ఇంకా ఇరుకున ప‌డిందా?  ఇప్ప‌డ‌స‌లు ఆపా ర్టీ కానీ, ఆ పార్టీ అధినేత కానీ, నైతిక విలువ‌లు, నిజాయితీ, మేం స్వ‌చ్ఛం అనే మాట‌ల‌ను ప‌లికే హ‌క్కు కూడా లేకుండా చేసుకున్నారా?  వైసీపీ నుంచి మ‌రింత‌గా ఎదురు దాడి జ‌ర‌గ‌నుందా? అంటే తాజాగా జ‌రిగిన ప‌రిణామం అవున‌నే స‌మాధాన‌మే ఇస్తోంది. వివ‌రాలు చూద్దాం.. ఇటీవ‌ల నంద్యాల‌లో టీడీపీ నుంచి వ‌చ్చిన శిల్పా బ్ర‌ద‌ర్స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. వీరిలో అప్ప‌టికే ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి జ‌గ‌న్ పిలుపు మేర‌కు త‌న ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి అప్ప‌టిక‌ప్పుడు రాజీనామా చేసేశారు. అంతేకాదు, తాను నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డ్డాన‌ని, జ‌గ‌న్ చెప్ప‌గానే  ఆరేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ.. ఎమ్మెల్సీగా రాజీనామా చేశాన‌ని చ‌క్ర‌పాణి చెప్పుకొచ్చారు.

నంద్యాల సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భా వేదిక‌పై వేలాదిమంది ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో చేసిన ఈ రాజీనామాను చ‌క్ర‌పాణిరెడ్డి అప్ప‌టిక‌ప్పుడే మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ రెడ్డి సుబ్ర‌మ‌ణ్యానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.  చైర్మ‌న్ ఫార్మాట్‌ లోనే చేసిన రాజీనామాకు డిప్యూటీ చైర్మ‌న్ ఆమోద ముద్ర వేశారు. దీంతో నైతిక‌తే విజ‌యం సాధించిన‌ట్ట‌యింది.ఇక‌, ఇప్పుడు టీడీపీ వైపే అంద‌రి వేళ్లూ క‌నిపిస్తున్నాయి. నేను సీనియ‌ర్ నాయ‌కుడున‌ని, దేశంలో ఉన్న సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌లో తానే సీనియ‌ర్‌న‌ని,  త‌న‌కు ఎలాంటి మ‌చ్చ‌లూ లేవ‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఈ రాజీనామా ఆమోదం కంటిపై కునుకులేకుండా చేస్తుంద‌ని అంటున్నారు నిపుణులు.

దీనికి ప్ర‌ధానంగా ఇటీవ‌ల కాలంలో వైసీపీ నుంచి త‌న పార్టీలోకి వివిధ ప‌ద‌వులు ఎర‌వేసి మ‌రీ.. 20 మంది ఎమ్మెల్యేల‌ను బాబు లాక్కుపోయారు. అయితే, వాళ్లంతా త‌న పార్టీ జెండాపైనా, త‌న ఫేస్ వాల్యూపైనా గెలిచార‌ని, వారితో రాజీనామా చేయించి ద‌మ్ముంటే ఎన్నిక‌ల్లో గెలిపించుకోవాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లుమార్లు బాబుకు స‌వాల్ విసిరారు. అయినా కూడా తేలు కుట్టిన దొంగ‌లా టీడీపీ నేత‌లు ఎవ‌రూ దీనిపై స్పందించ‌లేదు. కానీ, జ‌గ‌న్ మాత్రం టీడీపీ నుంచి వ‌చ్చిన శిల్పాతో స‌భా వేదిక‌పైనే రాజీనామా చేయించి పార్టీ కండువా క‌ప్పారు. దీంతో ఇప్పుడు నైతిక‌త అంశం పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారితీసింది. రాబోయే రోజుల్లో బాబుకు ఈ ప‌రిణామంతీవ్ర ఇబ్బంది కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News