తీవ్ర పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లో అధికారం మారింది. కాంగ్రెస్ చేతుల నుంచి బీజేపీ అధికారం లాక్కున్నది. ప్రభుత్వం ఏర్పడిన చాన్నాళ్లకు ఇప్పుడు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ ఆడియో టేపు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియో టేపులో పలు సంచలనాత్మకమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే శివరాజ్ సింగ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో ఇప్పుడు లీకయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో ఉండటం బీజేపీ అధినాయకత్వానికి ఇష్టం లేదని కమలనాథ్ ప్రభుత్వం కూలదోయాలనే కంకణం కట్టుకుందని ఆ ఆడియోలో ఉంది. మొత్తం 9.8 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో పరిణామాలు ఒక్కసారిగా మారాయి.
జ్యోతిరాదిత్య లేకుండా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడం కష్టమని, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు అతడి అనుచరులు కూడా సహకరిస్తేనే సాధ్యమవుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతున్నట్టు ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియోలో ప్రధానంగా ఈ అంశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర జేసింది. తమ ప్రభుత్వాన్ని కావాలనే గద్దె దించిందని మండిపడింది. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని తాము మొదటి నుంచే చెబుతున్నామని ఇప్పుడు ఈ ఆడియో వాస్తవం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ చెప్పారు. బీజేపీ పాల్పడిన ఈ కుట్ర రాజకీయంపై కోర్టును ఆశ్రయిస్తామని పీసీసీ అధ్యక్షుడు జితు పట్వార్ తెలిపారు.
అయితే ఆ వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సమయంలో ఇండోర్‌లోని సాన్వార్ అసెంబ్లీ నియోజకవర్గంలో. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పుడు ప్రసంగించారు. ఈ సభలోనే ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం జరిగిన పరిణామం మీకు తెలిసిందే. జ్యోతిరాదిత్యా సింధియాను పార్టీలో చేర్చుకుని అతడికి సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించి కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. మార్చి 20వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.