తెలంగాణలో హూజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ఖరారైంది. ఇవన్న ఎమ్మె్ల్యే కోటా కింద భర్తీ కావాల్స ఉంది. శాసన సభలో సంఖ్యా బలం ఆధారంగా నిర్ణయించే ఈ పదవులు దాదాపు అధికార పార్టీ టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. అయితే పార్టీలోని కొందరునాయకులు తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆరు స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారిలో మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఆయను కేబినెట్లోకి తీసుకుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇక మండలి చైర్మన్ గా మాజీ స్పీకర్ మధుసూధనాచారిని నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన మధుసూధన చారి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి హామీ మేరకు ఆయనను ప్రస్తుతం ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్ గా మధుసూధనచారిని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కూడా ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది.అయినను ఎమ్మెల్సీగా తీసుకొని దళిత బంధు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
హూజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోకవర్గంలోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా కప్పారు. అయితే ఉప ఎన్నికలో టికెట్ ఆశించి పార్టీలో జాయిన్ అయిన కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అయితే ఆ ఫైలు గవర్నర్ కు పంపడంతో అక్కడ పెండింగులో ఉంది. దీంతో ఆయన నిరాశ చెందకుండా ఎమ్మెల్యే కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా ఈసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎంగా కొనసాగారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతోఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు కడియం పేరును కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మరోనేత ఎల్. రమణకు కూడా ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లే తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రమణను ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీలో చేర్చుకున్నారు. హుజూరాబాద్ లో పద్మశాలి ఓట్లను ఆకర్షించేందుకు ఆయకు గులాబీ కండువా కప్పారన్న ప్రచారం జరిగింది. అయినా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకశాలు తక్కువే అని వార్తా కథనాలు వెలువడుతుండడంతో పార్టీపై విమర్శలు రాకుండా ఎల్ .రమణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మొత్తగా ఆరుగురి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఎక్కువగా బీసీ వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మండలి చైర్మన్ పదవి కూడా మధుసూధనచారికి ఇస్తున్నట్లు తెలుస్తుండడంతో ఆయన బీసీ వర్గాలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.