డ్యాష్ బోర్డు కాదది.. డ్యాష్ డ్యాష్ బోర్డు

Update: 2017-07-13 06:43 GMT
రాష్ట్రంలో పరిస్థితి ఏంటి... విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. వీధి దీపాలు ఎన్నున్నాయి? ఎన్ని వెలుగుతున్నాయి? ఆధార్ అనుసంధానం ఎంత వరకు పూర్తయ్యింది?  ఏ కార్యాలయంలో, ఏ జిల్లాలో ఎంత మంది ఉద్యోగులు విధులకు హాజరువుతున్నారు… వారిలో  ఎంత మంది ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా విధులకు హాజరవుతున్నారు? జిల్లాల్లో వర్షపాతం ఎలా ఉంది? ఏ శాఖ పనితీరు ఎలా ఉంది... వంటివన్నీ ఒక్క లుక్ లో తెలుసుకునేందుకు ఏర్పాటైన సీఎం డ్యాష్ బోర్డ్  అప్ డేషన్ సక్రమంగా సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డ్యాష్ బోర్డు హోం పేజీలోనే ఎన్నో ఖాళీలు కనిపిస్తుండడమే దీనికి నిదర్శనం.
    
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా.. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ఆయా శాఖల నుంచి అందుతున్న వివిధ అంశాలను రియల్ టైమ్ లో అప్ డేట్ చేయాలి. మొదట్లో ఇది పక్కాగా సాగేది. కానీ, క్రమేణా లోపాలున్న శాఖల నుంచి అప్ డేట్ కావడం లేదని తెలుస్తోంది.
    
ముఖ్యంగా వైద్య - ఆరోగ్య శాఖ వంటి శాఖలు ఈ విషయంలో ట్రాన్సపరెంటుగా లేవన్న ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పలు ఇతర శాఖలకు సంబంధించి కూడా డ్యాష్ బోర్డులో సరైన సమాచారం ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం అన్ని సందర్భాల్లో చూసుకోవడం వీలు కాకపోయినా కనీసం ఆయా శాఖల మంత్రులైనా డ్యాష్ బోర్డు ఆధారంగా మానిటర్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు.
Tags:    

Similar News