స్మృతీ ఇరానీ.. ఈ మాటలేంటమ్మా..!

Update: 2019-05-06 07:44 GMT
గతంలో 'ఆంటీ నేషనల్' అంటూ స్మృతీ ఇరానీ గురించి ఒక మీడియా వర్గం కథనం రాయడం దుమారానికి కారణం అయ్యింది. స్మృతీ ఇరానీని కించపరుస్తూ ఉన్నట్టుగా ఉన్న ఆ హెడ్డింగ్ పై బీజేపీ వాళ్లు ఫైర్ అయ్యారు. అది అర్థం చేసుకోదగిన ఆవేదనే.

ఆ తర్వాత స్మృతీని ఉద్దేశించి రాజ్యసభలో శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. 'నువ్వేంటో నాకు తెలుసు..' అని అంటూ తీవ్రమైన పదజాలంతో శరద్ యాదవ్ విరుచుకుపడ్డాడు. ఒక మహిళలను అలా మాట్లాడటం, అందునా చట్ట సభలో అలాంటి మాటలు మాట్లాడటాన్ని అందరూ ఖండించారు.

తన విషయంలో అలాంటి మాటలు వినిపించినప్పుడు స్మృతీ ఇరానీ తట్టుకోలేకపోయింది. ఆ విషయంలో ఆమెను అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే సమయంలో ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కూడా స్మృతీ ఇరానీ తనను తాను గుర్తు చేసుకుంటే మంచిదేమో!

తాజా ఈ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రాను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. 'ప్రియాంక వాద్రా ఈ మధ్య కాలంలో తన భర్త పేరు కన్నా నా పేరునే ఎక్కువగా తలుచుకుంటున్నారు..' అని ఈమె ఎద్దేవా చేసింది. ప్రియాంకను విమర్శించాలనుకుంటే స్మృతీ ఇరానీ విమర్శించుకోవచ్చు. అయితే వ్యక్తిగత విషయాలు ఎందుకు? అచ్చం ఇదే మాటనే ఎవరైనా స్మృతీ ఇరానీని ఉద్దేశించి అన్నారని అనుకుందాం. అప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉంటుంది?

ఆల్రెడీ పలు వ్యాఖ్యానాలను ఎదుర్కొన్నారు ఈ బీజేపీ నేత. ఆ విషయంలో ఈమెకు సానుభూతి ఉంటుంది. అయితే మళ్లీ ఈమె ఇలా మాట్లాడటం మాత్రం ఏ మాత్రం సమర్థనీయం కాదు!
Tags:    

Similar News