దేశవ్యాప్తంగా కుదిపేసిన హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి సంబంధించిన ఒక కీలక విషయాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా వర్సిటీల్లో చోటు చేసుకుంటున్న ఉదంతంపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాల్ని ఎలాంటి త్రోటుపాటు లేకుండా ఆధారాలతో సహా వెల్లడించారు.
తాజాగా కేంద్రమంత్రి స్మృతి చెప్పిన మాటల్ని తీసుకుంటే.. రోహిత్ మరణం.. అనంతరం వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై సందేహాలు కలిగేలా ఉండటం గమనార్హం. రోహిత్ మరణం గురించి కేంద్రమంత్రి ఏం చెప్పారు? ఆమె ప్రస్తావించిన కీలక అంశం ఆమె మాటల్లోనే చూస్తే..
‘‘రోహిత్ మరణంపై చాలామంది చాలా మాట్లాడారు. కానీ.. అతని విషయంలో చర్యలు తీసుకున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఒక్కరిని ఎన్డీయే ప్రభుత్వం నియమించలేదు. వారందరిని యూపీఏ ప్రభుత్వమే నియమించింది. ఈ సంఘటన జరిగినప్పుడు దీనిని దళిత విద్యార్థి మరణంలా కాకుండా.. ఒక బిడ్డ మరణంగా చూడాలని చెప్పాను. జాతి ఆధారంగా నేను ఒకరికి న్యాయం.. మరొకరికి అన్యాయం చేయలేదు. రోహిత్ మరణాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు. అదెలానో చెబుతారు. తెలంగాణ పోలీసులు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లోని వివరాల ప్రకారం.. రోహిత్ ఉదంతం గురించి పోలీసులకు సాయంత్రం 6-20 గంటలకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు.అప్పటికే రోహిత్ ను దించి.. టేబుల్ మీద పడుకోబెట్టారు. అతని వద్ద ఓ లేఖ కనిపించింది. అక్కడికి డాక్టర్ ను అనుమతించలేదు. పల్స్ 40.. 30కి పడిపోయినా బతికించే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ.. రోహిత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. మరి.. రోహిత్ చనిపోయినట్లు ఎవరు ధ్రువీకరించారు? రోహిత్ చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు. తర్వాతి రోజు ఉదయం వరకు రోహిత్ శరీరాన్ని దాచి పెట్టారు. ఇదంతా పోలీసులే చెప్పారు. ఇక్కడ ఎవ్వరూ న్యాయం కోరుకోలేదు. రాజకీయమే కోరుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మదిలో కొన్ని ప్రశ్నలు మెదులుతాయి. అవేమంటే..
= సాయంత్రం 6-20కి రోహిత్ చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే.. పోలీసులు వచ్చినప్పుడు.. డాక్టర్ ను ఎందుకు అనుమతించలేదు?
= విద్యార్థులు డాక్టర్ ను అడ్డుకుంటే.. వారి విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
= రోహిత్ మరణించాడని కన్ఫర్మ్ చేసింది ఎవరు?
= ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులకు తెలిస్తే.. వెంటనే అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలిస్తారు కదా? పోలీసులు అలా ఎందుకు చేయలేకపోయారు?
= రోహిత్ మరణం మీద అంత లొల్లి జరిగినప్పుడు.. కొందరు విద్యార్థుల నుంచి ఎదురైన పరిస్థితిని వారు బయటకు ఎందుకు వెల్లడించలేదు?
= విద్యార్థులు కొందరు ఆందోళన చేస్తుంటే.. వారికి నచ్చ జెప్పి జరగాల్సినవి చూడాలి కానీ.. తర్వాతి రోజు వరకూ చేష్టలుడిగిపోయినట్లుగా పోలీసులు ఎందుకు వ్యవహరించారు?
= రోహిత్ మరణం గురించి రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసినోళ్లు.. మద్దతుగా మాట్లాడిన వారంతా? అతను చనిపోయారని చెబుతున్న సమయానికి వైద్యుడ్ని అనుమతించని వారిని ఎందుకు నిలదీయటం లేదు?