రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ప్రకృతి మీద అధిపత్యానికి మనిషి చేసే ప్రయత్నాలు అన్నిఇన్నికావు. కానీ.. ఎంతచేసినా.. మరెంత సాధించినా ప్రకృతి ముందు మనిషి పిపీలకమే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మనకు తెలీని.. మన దృష్టికి రాని చాలానే అంశాలు ఉన్నాయన్నది పచ్చి నిజం. గ్రహాంతరవాసుల కోసం.. అనంత విశ్వంలో ఏం జరుగుతుందంటూ ఆరా తీసే మనిషి.. మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరీక్షగా చూడాల్సిన అవసరం చాలానే ఉంది.
ప్రకృతిలో ఉండే చిత్రవిచిత్రాలు అప్పుడప్పడు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి తెలంగాణరాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో రామయ్య అనే రైతు ఇంట్లో ఒక అరుదైన తాచు పాము కనిపించింది. ఈ పాము ప్రత్యేక ఏమిటంటే.. పాముకు కింద భాగంలో గోర్లతో వేళ్లున్నాయి. గడ్డివాము పక్కనున్న మొద్దు కింద ఉన్న పామును గుర్తించిన స్థానికులు.. స్నేక్ రెస్క్యూ టీంకు కబురు పంపారు. వారు వచ్చి.. పామును బంధించారు. అనంతరం.. దాన్ని పరిశీలించగా.. ఈ పాముకు కాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఇలాంటి పాములు చాలా అరుదుగా ఉంటాయని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/