1960లో సోలార్.. ఎలక్ట్రిక్ కార్లు ఎలా ఉన్నాయంటే..!

Update: 2022-12-17 00:30 GMT
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకు అలవాటు పడటంతో కొత్త.. పాత జ్ఞాపకాలపై నెటిజన్ల మధ్య చర్చ జోరుగా సాగుతోంది. మా కాలంలో ఇలాంటి టెక్నాలజీ ఉందని సీనియర్ సిటిజన్లు చెబుతుంటే.. నేటి సంగతులపై యువత తమ అభిప్రాయాన్ని పంచుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల కాలంలో శబ్ధ కాలుష్యం.. వాయు కాలుష్యం పెరుగుతుండటం.. చమురు నిల్వలు తగ్గుతుండటంతో అన్ని దేశాలు కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే డీజిల్.. పెట్రోల్ వాహనాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లు.. సోలార్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సోలార్.. ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్ కానుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఈ దిశగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళుతోంది.

టెస్లాతోపాటు దిగ్గజ ఆటో మొబైల్స్ కంపెనీలన్నీ కూడా ఇటీవల కాలంలో సోలార్.. ఎలక్ట్రిక్ మోపోడ్లు.. ద్విచక్ర వాహనాలు.. ఫోర్ వీలర్స్ ను తయారు చేస్తున్నాయి. మరోవైపు సోలార్ తో విద్యుత్ వినియోగం కూడా ఇటీవల పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని రైతులు విరివిరిగా వినియోగిస్తున్నారు.

గృహ అవసరాల కోసం.. కార్యాలయాల అవసరాల కోసం కూడా సోలార్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. అయితే 1960లోనే సోలార్.. ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలో కాలిఫోర్నియాకు చెందిన కొందరు వ్యక్తులు సోలార్ ఎనర్జీ బ్యాటరీతో నడిచే కారును నడుపుతున్నారు.

బ్యాటరీతో నడిచే ఈ కారు చూడటానికి కూడా ఎంతో ముద్దుగా ఉంది. అప్పట్లోనే ఇంజనీర్లు బ్యాటరీతోనే నడిచే కార్లను తయారు చేసినట్లు అర్థమవుతోంది. ఈ కాలంలోనే సోలార్ ట్రైన్స్.. సోలార్ వాకీటాకీలు సైతం ప్రజలు విరివిగా వినియోగించినట్లు తెలుస్తోంది. పెట్రోల్.. డీజిల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్.. సోలార్ వెహికల్స్ క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రభుత్వాలు తిరిగి సోలార్.. ఎలక్ట్రికల్ వాహనదారులను ప్రోత్సహిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News