జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పవన్ కల్యాణ్ మంచి మనిషిగా చెబుతూనే.. అలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రాడన్నది తన అభిప్రాయంగా ఆయన చెప్పారు. తాను పెట్టుబడులు పెట్టలేనని.. ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలీదని పవన్ తరచూ చెబుతుంటారు.. ఇది రాజకీయ నాయకుడికి తగదన్నారు. పాలిటిక్స్‌లో బలంగా ఉండాలని.. పవన్ మంచి వారని.. ప్రజలు మంచిని కోరుకుంటారంటూ డబుల్ ఎడ్జ్ మాటల్ని చెప్పుకొచ్చారు సోమిరెడ్డి. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన వార్తా ఛానల్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాల్ని చెప్పుకొచ్చారు.
తన గురించి చెబుతూ.. తాను ఎవరినీ ఎదగనీయననే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ కల్చర్ టీడీపీలో లేదని.. తనకు మంత్రి పదవి ఇవ్వొద్దని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో ఎవరూ చెప్పలేదన్న సోమిరెడ్డి.. జగన్ ను తిట్టేందుకే తన కెరీర్ పరిమితం కాలేదన్నారు. రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నియమం పార్టీలో లేదన్న ఆయన జగన్ మీద ఉన్న కేసుల నుంచి బయటపడే ప్రసక్తే లేదన్నారు. జగన్ పైన అదనపు ఛార్జిషీట్ సమా పన్నెండు కేసులు ఉన్నాయని.. ఆ కేసులన్నింటికి సంబంధించి ఆధారాలున్నాయని.. వాటి నుంచి ఆయన బయటపడే ప్రసక్తే లేదన్నారు.
పవన్ గురించి చెప్పుకొస్తూ.. ఆయన లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే వ్యక్తి కాదని.. వ్యూహకర్త మాత్రం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారని.. ఏమవుతుందో చూడాలన్న ఆయన.. పవన్ తమ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించలేదని.. ఆయన తప్పులు జరిగితే చెబుతుంటారన్నారు. ఎక్కడైనా తప్పులు ఉంటే పవన్ చెబుతారని.. దాని వల్ల సంబంధిత మంత్రిత్వ శాఖ యాక్టివ్ అవుతుందన్న సోమిరెడ్డి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహాత్మాగాంధీ వచ్చి పోటీ చేసి.. తాను డబ్బు ఇవ్వనని.. బ్రాందీ ఇవ్వనంటే గెలిచే పరిస్థితులు లేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ఒకేలా ఉంటానన్న ఆయన.. గతంలో తాను ఓడిపోతానని తెలిసినా .. పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే తాను పోటీ చేశానని తన ఓటమి గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/