వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన చైతన్య యాత్రను నెల్లూరులో ప్రారంభిస్తూ రోజా గురించి ప్రస్తావించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. రోజా నోరు తెరిస్తే రేప్ అనే మాట తప్ప మరోటి రాదని అన్నారు. ఎమ్మెల్యే అయి ఉండి సభా వేదికగా రేప్ విమర్శలు చేసిన ఘనత రోజాకే దక్కిందని ఎద్దేవా చేశారు. రోజా నోరు తెరిస్తే రేప్ అంటుండటంతో విపక్షాలు సైతం ఆచితూచి స్పందించాల్సి వస్తుందన్నారు.
తెలుగుదేశంపై విమర్శలు చేసే రోజాపై తాము ధీటుగా స్పందించగలమని చెప్పిన సోమిరెడ్డి...అలా దూకుడుగా వెళ్లాలని చూస్తే తమ స్థాయిని తగ్గించుకోవడం అవుతుందని భావించి ఆగిపోతున్నట్లు తెలిపారు. కానీ రోజా సభ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందని సోమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ వేత్తగా తన భాషను రోజా సమీక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/