ఆస్పత్రిలో సోనియా... కారణమేంటంటే?

Update: 2020-07-30 18:01 GMT
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో భారత్ లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజంగానే కలకలం రేపుతోంది. సోనియా గాంధీకి కరోనా ఏమైనా సోకిందా? అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే అలాంటిదేమీ లేదని, రోటీన్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వచ్చారని సర్ గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్ డీఎస్ రాణా వెల్లడించారు.

గత కొంతకాలంగా సోనియా గాందీ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో గర్భాశయ కేన్సర్ సోకడంతో ఆమె విదేశాలకు వెళ్లి మరీ చికిత్స చేయించుకుని వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అదే క్రమంలో పలుమార్లు అనారోగ్యానికి గురి కావడంతో సర్ గంగారామ్ ఆస్పత్రిలోనే చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు అనారోగ్యానికి సంబంధించి జనరల్ చెకప్ కోసమే సోనియా గాంధీ ఆస్పత్రికి వచ్చినట్టుగా రాణా తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
Tags:    

Similar News