ఆట ఏదైనా కావొచ్చు.. నియమాల్ని ఉల్లంఘించకూడదని. రంగం ఏదైనా కానీ లక్ష్మణ గీతను దాటటం మొదలెడితే.. విషయం ఎక్కడికో వెళ్లే పరిస్థితి. చేతిలో పవర్ ఉన్నప్పుడు మహా ఉత్సాహంగా ఉంటుంది. వ్యవస్థలు చెప్పినట్లు ఆడుతుంటే.. మహా కిక్కు వస్తుంది. అయితే.. పవర్ ఎప్పుడు పర్మినెంట్ కాదని.. ఏదో ఒక రోజు చేజారిన తర్వాత.. అంతకంతకూ బదులు చెల్లించాల్సి వస్తుందని.. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని గుర్తించటానికి అస్సలు ఇష్టపడని తత్త్వం ఉంటుంది అధినేతలకు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సానియాగాంధీకి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో మిత్రపక్షాలనే కాదు.. తన మాటకు ఎదురు చెప్పిన వారందరికి చుక్కలు చూపించిన విషయంలో సోనియమ్మ ట్రాక్ రికార్డు మామూలుగా ఉండదు. వ్యవస్థల్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఎలా ఆడించాలన్న విషయంలో ఆమెకున్న నేర్పు అంతా ఇంతా కాదన్న మాట పలువురి నోట వినిపిస్తుంది.
ఎవరి దాకానో ఎందుకు.. తాను చెప్పినట్లుగా తలాడించలేదన్న ఒకే ఒక్క కోపంతో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆమె వ్యవహరించిన వైఖరిని మర్చిపోగలమా? అలాంటి ఆమెకు.. ఇటీవల కాలంలో తరచూ తీహార్ జైలును సందర్శించాల్సి వస్తోంది. పవర్ చేతిలో ఉన్నప్పుడు తనకు అత్యంత కీలకమైన నేతలు ఒక్కొక్కరు జైలుకు వెళుతున్న వేళ.. ఎప్పుడూ అలవాటు లేని రీతిలో జైళ్లకు వెళ్లి పరామర్శల పర్వానికి తెర తీయాల్సి వస్తోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత చిందరంబం మాష్టారు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీం బెయిల్ ఇచ్చినప్పటికి.. చట్టబద్దంగా ఉన్న చిక్కుల (ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో బెయిల్ రాకపోవటం) కారణంగా ఇంకా ఆయన తీహార్ జైల్లోనే ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఆయన్ను తీహార్ జైలుకువెళ్లి పరామర్శించి వచ్చిన సోనియా.. ఇప్పుడు మరోసారి వెళ్లాల్సి వచ్చింది.
పార్టీకి ట్రబుల్ షూటర్.. తనకు అత్యంత సన్నిహితుడు.. రాజకీయ సలహాదారు అహ్మాద్ పటేల్ ను రాజ్యసభకు పంపే విషయంలో సాయం చేసిన కర్ణాటకకు చెందిన డీకే శివకుమార ఇప్పుడు తీహార్ లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించి రావటం తెలిసిందే.
ఇప్పుడు సోనియా వంతు వచ్చింది. తనకు సన్నిహితంగా.. తాను పెట్టే టార్గెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసే ట్రబుల్ షూటర్ ట్రబుల్స్ లో కూరుకుపోయిన వేళ.. ఆయనలో స్థైర్యం తగ్గకుండా ఉండేందుకు వీలుగా సోనియా గాంధీ తీహార్ జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు. ఇదంతా చూసినప్పుడు.. మీరు నేర్పిన పాఠాలే.. మీకు ఎదురవుతున్నాయి.. గమనించారా సోనియాజీ అంటూ తీహార్ జైలు మౌనభాషలో చెబుతున్నట్లుగా అనిపించక మానదు.