గడిచిన కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ పెదవి విప్పారు. ఆచితూచి అన్నట్లు మాట్లాడే ఆమె.. మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పగ్గాల్ని కొడుకు చేతికి అప్పగించిన తర్వాత ఆమె పెద్దగా మాట్లాడిందిలేదు. ఆ మాటకు వస్తే..కాంగ్రెస్ చీఫ్ గా ఆమె భారీగా వ్యాఖ్యలు చేసింది లేదు. అలాంటి ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం సంచలనంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్న ఆమె.. సదరు సదస్సులో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లు దేశం అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకోవటం దేశ ప్రజల వివేకాన్ని అవమానించటమేనని అభివర్ణించిన ఆమె.. బీజేపీ తీరుపై తీవ్రంగా స్పందించారు.
సోనియా ఏమన్నారంటే..
+ 2014 మే 26 ముందు భారతదేశం నిజంగా అంధకారంలో ఉందా? గడిచిన నాలుగేళ్లలో దేశం అభివృద్ధి వైపు వెళుతోందా?
+ నాలుగేళ్లుగా భారత్ అభివృద్దిలోకి వెళుతుందని చెప్పటం మన ప్రజల తెలివిని.. వివేకాన్ని అవమానించినట్లు కాదా?
+ బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని విచక్షణ లేకుండా మాట్లాడటం దేశ సమగ్రతను అణగదొక్కే ప్రయత్నంలో భాగమే.
+ బీజేపీని తిరిగి అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదు.
+ గడిచిన నాలుగేళ్లలో దేశం అభివృద్ధి సాధించిందని గొప్పలు చెప్పటం అవమానించటమే.
+ ప్రస్తుతం మన దేశం.. సమాజం.. స్వేచ్ఛలు మొత్తం క్రమంగా వేధింపులకు గురి అవుతున్నాయి.
+ పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. వాళ్లు మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదు. పార్లమెంటు ఉన్నది ఎందుకు? కనీసం పార్లమెంటు నిబంధనలు కూడా అనుసరించటం లేదు.
+ పార్లమెంటులో పీఎన్ బీ కుంభకోణం పై నిలదీసే అవకాశం లేకుండా మా గొంతు నొక్కుతున్నారు.
+ పార్లమెంటుపై వాజ్ పేయ్ కి అమితమైన గౌరవం ఉండేది. నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఆయనెవరో నాకు తెలీదు.
+ ప్రజల్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవటానికి ప్రభుత్వ పథకాలన్నింటికి అధార్ కార్డును తప్పనిసరి చేస్తోంది.
+ ప్రస్తుతం దేశం తిరోగమన పథంలో ఉంది. బీజేపీ హయాంలో అసహనం పెరిగిపోయింది.. భయం, బెదిరింపులు, మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయి.
+ పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇక పార్లమెంటు మూసేస్తే.. మేమంతా ఇంటికి వెళ్లిపోతాం. వాజ్‌పేయి హయాంలో మాదిరిగా పార్లమెంటు కార్యకలాపాలు గౌరవప్రదంగా ఉండట్లేదు. .
+ మన న్యాయవ్యవస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది.
+ మాపై చేస్తున్న అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువ చేసి చూపుతున్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, చర్చలను అంగీకరించాలి.ఏకపాత్రాభినయాన్ని కాదు.
+ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుంది. మన్మోహన్ నా కంటే మంచి ప్రధాని అవుతారని నాకుతెలుసు. నా పరిమితులు నాకు తెలుసు.
+ రాజస్థాన్ - మధ్యప్రదేశ్ లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.