బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కొవిడ్ బాధితులకు ఎన్నో విధాలుగా సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సీజన్ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. కోటిన్నర రూపాయల వ్యయంతో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ అంగీకరించినట్టు సమాచారం.
నెల్లూరు జిల్లాలోని సోనూ మిత్రులు అతనికి ఫోన్ చేసి.. జిల్లాకు సహాయం చేయాలని కోరారట. దీనికి అంగీకరించిన నటుడు.. ఎలాంటిసహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడట. దీంతో.. అతని మిత్రులు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును ఆదివారం కలిసినట్టు సమాచారం. ఈ సందర్భంగా.. జిల్లాలో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారట. ఆ తర్వాత సోనూతో మాట్లాడిన కలెక్టర్.. ఇదే విషయాన్ని చెప్పారట. దీనికి నటుడు అంగీకరించినట్టు సమాచారం.
ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని అందిస్తానని, అవసరమైన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించాడట సోనూ. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇంత వరకూ వెలువడలేదు. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది చూడాలి.