సోయం బాపూరావు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయనొక సంచలనం. ఉనికిలేని చోట.. బీజేపీకి దొరికిన నిప్పుకణిక. మొన్నటి వరకూ ప్రజల్లో ఎంతో సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఒక్కసారిగా రూట్ మార్చారా..? మాటల్లో చురుకుదనం పెంచారా..? అంటే ఔననే అంటున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఉనికి కూడా కనిపించదు. పాత జిల్లాలో సగం ఏజెన్సీ ప్రాంతమే. అలాంటి చోట టీఆర్ ఎస్ కు గత దశాబ్ద కాలంగా ఎదురు లేకుండా పోయింది. బీజేపీకి చాలా గ్రామాల్లో ఒక్క ఓటు కూడా లేని పరిస్థితి. అలాంటి ప్రాంతం నుంచి సోయం బాపూరావు ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచి.. రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.
తాజాగా.. ఆదివాసీ గిరిజన నాయకుడిగా.. ఆ తెగల్లో ఆయనకు ఉన్న పట్టుకు నిదర్శనంగా ఫలితాన్ని చూడొచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంపీగా గెలిచాక సోయం బాపూరావు తన మాటల్లో కరుకుదనం పెంచారు. కదలికల్లో మరింత వేగం పెంచారు. ఆయనలో ఎందుకింత మార్పు వచ్చిందన్న దానిపై అన్నివర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివాదాలకు దూరంగా.. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయన.. బీజేపీలో చేరిన తర్వాత ఒక్కసారిగా ఆయన ఊహించని మార్పు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాజా విజయోత్సవ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆదివాసీ బాలికలు - అమ్మాయిలపై వేధింపులకు పాల్పపడుతున్న వారి తలలు నరికివేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాపూరావు హాట్ టాపిక్ గా మారిపోయారు. దీంతో ఆయనను ఆదిలాబాద్ రాజాసింగ్ గా పిలుస్తున్నారు అనుచరులు. హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ఆయనను పోల్చుతున్నారు. రాజాసింగ్ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు.
ఇదే సమయంలో.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే భవిష్యత్ లో ఆయనకు నష్టం జరుగుతుందని పలువురు అంటున్నారు. అయితే.. బాపూరావు.. పక్కా బీజేపీ పంథాలో నడుస్తున్నారని - అందుకే రాజకీయ - మత - సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. బీజేపీ ఈ అంశాలతోనే తెలంగాణలో పాగా వేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మరి ఆదిలాబాద్ రాజాసింగ్.. భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.