తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ గా చరిత్రలో నిలిచిపోయారు సిరికొండ మధుసూదనాచారి. అసెంబ్లీ రద్దు అయినప్పటికీ కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకూ స్పీకర్ గా ఆయనే కొనసాగుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికైన సభ్యుల్లో ఒకరు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించి.. ఆ తర్వాత స్పీకర్ గా ఎంపిక చేసుకుంటారు.
తన తోటి ఎమ్మెల్యేలంతా తాజా మాజీలు అయితే.. సిరికొండ మధుసూదనాచారి మాత్రం స్పీకర్ గానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలు వరుసగా వస్తున్నాయి. ఈమధ్యన ప్రచారంలో సాగుతున్న వేళ.. ఆయన తనకు ఎదురైన అంతిమయాత్రలో.. కట్టె మోసి వార్తల్లోకి ఎక్కారు.
తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రెండు ఉదంతాలు గుండెల్ని మెలిపెట్టే మాదిరి ఉండటం గమనార్హం. తాజాగా ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ప్రచారాన్నినిర్వహించారు.మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన కార్యకర్త ఇంట్లో లంచ్ చేసి బయట కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు.
అదే సమయంలో అక్కడికి 70 ఏళ్ల ముసలి అవ్వ ఒకరు వచ్చి స్పీకర్ వద్ద నిలబడ్డారు. ఫోన్ మాట్లాడిన తర్వాత స్పీకర్ ఆ వృద్ధురాలి వంక చూస్తున్న వేళ.. ఆమె తన చేతిలో ఉన్న ఒక రూపాయి నోటు ఇచ్చి స్పీకర్ చేతిలో పెట్టి.. తన తరఫున ఎన్నికల్లో గెలవాలంటూ దేవుడికి ముడుపు కడుతున్నట్లుగా ఆమె చెప్పారు. అలా అవ్వ అన్న మాటలకు స్పీకర్ సిరికొండ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.నీలాంటి వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటూ.. ఆమె కాళ్లకు మొక్కారు. దీంతో.. అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఒక స్పీకర్ గా వ్యవహరిస్తూ.. అందరితో కలిసిపోవటం.. వారితో మమేకం కావటం మధుసూదనాచారి స్పెషల్ గా చెప్పాలి. అవ్వ తనకు ఇచ్చిన రూపాయి నోటునుభద్రంగా దాచుకుంటానని చెప్పటమే కాదు.. తన పర్సులో దేవుడి ఫోటోతో పాటుగా దాచుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది.