ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర విజయవంతంగా నెలరోజులు గడిచిపోయిన సంగతి తెలిసిందే. కడప - కర్నూలు జిల్లాలో యాత్ర పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ అనంతరం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. ఈ యాత్రకు అనంతపురం జిల్లాలో భారీ స్పందన వస్తోందని వైసీపీ శ్రేణులను అంటున్నాయి. ఈ యాత్ర సందర్భంగా వైసపీ చేపట్టిన ప్రచార కార్యక్రమం పలువురి ని ఆకట్టుకోవడమే కాకుండా...వైసీపీ శ్రేణులను కొత్త ఉత్సాహంలో నింపాయని వివరిస్తున్నారు. ఇంతకీ వైసీపీ చేసిన ఈ వినూత్న ప్రచారం ఏమిటంటే..పలువురు మహిళలు వైసీపీ రంగులు ముద్రించిన చీరలతో హాజరవడం.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన నీలం మరియు ఆకుపచ్చ రంగు చీరలు ధరించిన సుమారు వంద మంది మహిళలు వైఎస్ జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ వెంట కదిలిన ఈ మహిళలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం స్థానికంగా ప్రత్యేకంగా ఈ వంద చీరలను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దాదాపుగా వెయ్యిమంది పాల్గొన్న బైక్ ర్యాలీ వెంట ఈ మహిళలు పాల్గొనడం యాత్రకు కొత్త ఆకర్షణను అందించింది. ఈ సందర్భంగా యాత్రకు హాజరైన ఓ మహిళ మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల పాటు యాత్రలో పాల్గొంటామని తెలిపారు. వైఎస్ జగన్ యాత్రకు సంఘీభావంగా మరింత మందిని సమీకరిస్తామని వెల్లడించారు.
కాగా, టీడీపీకి అనంతపురం జిల్లా కంచుకోట అనే సంగతి తెలిసిందే. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో 12 స్థానాలు టీడీపీ గెలుచుకోగా..2 మాత్రమే వైసీపీ గెలుచుకుంది. అయితే ఇందులో కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా పార్టీ ఫిరాయించారు. ప్రస్తుతం ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిమాత్రమే వైసీపీలో ఉన్నారు. అయినప్పటికీ వైసీపీ యాత్రకు విశేష స్పందన వస్తుండటంతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టిస్తోంది.