శ్రీలంక అట్టుడుకుతోంది.. రావణ కాష్ఠంలా రగులుతోంది.. ప్రజాందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. సోమవారం నాటి హింసా విధ్వంసాలతో దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూను బుధవారం వరకు పొడిగించారు. శ్రీలంకలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నడుస్తోంది. ఎవరైనా నిరసనలకు దిగితే.. అరెస్టు చేసేలా పోలీసులు, భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలిచ్చారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ శావేంద్ర సిల్వా కోరారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామన్నారు. కాగా, శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మొదటినుంచి అస్థిరతే..
శ్రీలంక విస్తీర్ణం 65,610 చదరపు కిలోమీటర్లు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో 195 దేశాలుంటే.. అందులో లంక స్థానం 120. జనాభా 2.20 కోట్లు. విస్తీర్ణ పరంగా చెప్పాలంటే.. గ్రేటర్ రాయలసీమ అంత ఉంటుంది. హిందూ మహా సముద్రం, బంగాళాశాతం కలిసేచోట ఓ నీటిబొట్టులా కనిపిస్తుంటుంది. అలాంటి లంకలో రాజకీయ అస్థిరత ఎక్కువే. భారత్ కు 1947 ఆగస్టు 15న స్వతంత్రం రాగా.. లంకకు 1948 ఫిబ్రవరి 4న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, 1959లో లంక నాలుగో ప్రధాని సొలొమాన్ దియాస్ బండారునాయకే తన ప్రయివేటు నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. తర్వాతి కాలంలో ప్రధాని అయిన తొలి మహిళగా కీర్తి గడించిన సిరిమావో
బండారు నాయకే ఈయన భార్యనే. ఇక 1970 తొలినాళ్ల నుంచి శ్రీలంకలో లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) ఉగ్రవాదం మొదలైంది.
రాజీవ్ ప్రాణాలు నిలిచేవే..
అతి చిన్న దేశమైన శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం తన ప్రాణాల మీదకు తెస్తుందని రాజీవ్ ఊహించలేదు. ఎల్టీటీఈని అణచివేసేందుకు ఆ దేశానికి శాంతి దళాన్ని పంపి ఆ ఉగ్రవాద సంస్థకు శత్రువయ్యారు. అంతేకాక ఆయన లంకలో పర్యటిస్తుండగా ఓసారి దాడి ప్రయత్నం కూడా జరిగింది. సైనిక వందనంలోని ఓ సైనికుడు తుపాకీ మడమతో రాజీవ్ తలపై కొట్టబోయాడు. ఈ ప్రయత్నం విఫలమైంది. మరికొంత కాలానికే ఆయన దారుణ హత్యకు గురయ్యారు.
కుదిపేసిన ఎల్టీటీఈ
1970 ల నుంచి 2009 వరకు ఎల్టీటీఈ హవాతో లంక మండిపోయింది. బాంబులు దాడులు, ఆత్మహుతి దాడులతో లంక ఓ రావణ కాష్టంలా రగిలింది. ప్రపంచంలోనే అత్యంత తీవ్ర ప్రమాదకరమైన సంస్థగా ఎల్టీటీఈ పేరుగాంచింది. 1991లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాడుతో ఆత్మహుతి దాడితో దారుణంగా హత్య చేసింది. మరో రెండేళ్లకే లంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఇలాగే ఆత్మహుతి దాడిలో చనిపోయారు. ఇక 2009 వరకు లంకను ప్రభాకరన్ ఎల్టీటీఈ కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే, 2009 మేలో అతడిని హతమార్చడం ద్వారా లంక కొంత స్థిమితపడింది. కానీ.. మళ్లీ రాజకక్సె లపై వ్యతిరేకతతో రగిలిపోతోంది.
రాజపక్స కుటుంబం అవినీతితో లంకను తీవ్ర అప్పుల్లో ముంచేసిందంటూ ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదుల నిరసన గళం వినిపిస్తున్నాయి. శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. పెట్రోల్ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు.. ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దృశ్యాలివే. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా శ్రీలంక జనం కొరతతో తీవ్ర అవస్థలు పడ్డారు.
మూడేళ్ల కిందటి బాంబు దాడితో
లంక పర్యాటక దేశం. దీని ద్వారానే ఆదాయం సమకూరుతుంది. అలాంటి లంకలో 2019 ఈస్టర్ దినాన చర్చిలో ఉగ్రదాడి జరిగింది.ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పతనమయ్యాయి. ఆ తర్వాత కరోనాతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు.
ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. జాతీయవాదం ముసుగులో రాజపక్స సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. మహీంద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్ని రాజపక్స సోదరులు, బంధువర్గాలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలున్నాయి. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున(శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్)కు చెందిన గొటబాయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్ రాజపక్స, బసిల్ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా ఉన్నారు.
గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్, యోషితాలకు కీలక పదవులు దక్కాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గొటబాయ, మహీందలు మినహా మిగతా వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, వీరిద్దరూ కూడా పదవుల నుంచి తప్పుకొంటేనే శ్రీలంకలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని
ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తూ వచ్చారు. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75శాతం వరకు నిధులు కేటాయించడం గమనార్హం. 2019లో గొటబాయ అధికారంలోకి వచ్చిన తర్వాత లంక సర్కారు విలువ ఆధారిత పన్నును 15శాతం నుంచి 8శాతానికి తగ్గించడంతో పాటు, ఏడు ఇతర రకాల పన్నులను రద్దు చేసింది. ధార్మిక సంస్థలను పన్ను పరిధి నుంచి తప్పించింది. ఫలితంగా కేవలం 30 నెలల్లోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి.
విదేశీ మారక నిల్వల పొదుపునకు ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. కృత్రిమ ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి సంక్షోభానికి దారితీసింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30 శాతం మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని సైతం ప్రభుత్వం పెడ చెవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. లంకలో మహీంద రాజీనామా చేసిన కొద్ది గంటలకే హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. దీంతో పాటు మహీంద కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మంగళవారం ఉదయం గొటబాయ నివాసాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అధ్యక్షుడి ఇంటికి అత్యంత సమీపంలోకి వచ్చేందుకు యత్నించగా.. సైన్యం వారిని అడ్డుకుంది. ప్రస్తుతం గొటబాయ నివాసం వద్ద భారీగా సైన్యం మోహరించింది.
హింసకు కారణమైన మాజీ ప్రధాని మహీందను అరెస్టు చేయాల్సిందేనని ప్రతిపక్ష రాజకీయ నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు ఓ ఎంపీ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహీంద రాజీనామాతో కేబినెట్ కూడా రద్దయింది. దీంతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు గొటబాయ చర్యలు చేపట్టారు. పరిస్థితుల దృష్ట్యా తక్షణమే పార్లమెంట్ సమావేశపర్చాలని ప్రతిపక్షాలు అధ్యక్షుడిని కోరాయి.