అదో వింత గ్రామం.. ఒకరు మరణిస్తే, వెంటనే మరొకరు కూడా..

Update: 2021-09-18 23:30 GMT
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. మనం ఎన్ని వింతలు , విశేషాల గురించి తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అలాంటి వింతల్లో తాజాగా మరో వింత వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామం లో వింత చోటు చేసుకుంటుందట. ఆ గ్రామంలో ఒకరు చనిపోతే , వెంటనే మరొకరు కూడా చనిపోతారట.  వందల సంవత్సరాలుగా ఈ తంతు సాగుతోంది. ఇందులో మర్మం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకరి ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే, కొద్దిరోజుల్లోనే మరొకరు చనిపోవడం జరుగుతోంది. అసలు ఎందుకిలా జరుగుందో అక్కడి గ్రామస్థులకు అంతుపట్టడం లేదు.

ఊరికి ఎన్నో శాంతులు చేయించారు. అయినా మరణాలు ఆగడం లేదు. అదే, మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామం. మహాభారతం లోని పాండవుల అరణ్యవాసాన్ని తలపించేలా ఉంది. తెల్లారితే ఎవరి వంతు అనే భయం వారిలో కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదు. నెన్నెలలో గ్రామంలో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు. నెన్నెల గ్రామానికి 500 ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు. నానియల్‌ అనే ఉర్దూపదం. అందుకే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. శతాబ్దాలనుంచి ఈ చావులు కొనసాగుతున్నాయి. ఊళ్లో ఒకరు చనిపోతే ఆ వెంటనే మరొకరు చనిపోవడం అనాధిగా వస్తోంది. చావుల రహస్యం వెనుక అసలు ఏముందోఅంతు పట్టటం లేదని ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

మూఢనమ్మకంగా భావించారు. అది అపోహ కొట్టిపారేశారు. వరుస మరణాలు కొనసాగడం, సాక్ష్యాలూ ఆధారాలు ఉండటంతో హేతువాదులు సైతం ముందుకు రావడం లేదు. తాత ముత్తాతల నుంచీ జంట చావుల ఆనవాయితీ నడుస్తోంది. ఆ ఊరికి గ్రహశాంతులే కాదు.. బలి కూడా ఇచ్చారు. వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయో నిపుణులకు చూపించారు. వేద పండితులతో అనేక పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. ఎన్నో చేసిన ఆ ఊరికి పట్టిన మహమ్మారి ఏంటో తెలియదు. చావులు మాత్రం ఆగడం లేదు. ఎవరి ఇంట్లో చావు కనిపిస్తే.. ఎవరి ఇంట్లో ఎవరూ చనిపోతారోనన్న భయమే ఊరందరికీ మృత్యుభయాన్ని కలిగిస్తోంది. కొన్నిసార్లు ఈ భయంతో ఇద్దరి నుంచి నలుగురి వరకూ కూడా చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది.

అందులో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. తరాలుగా సాగుతున్న ఈ వరుస జంట మరణాలపై ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతున్నారు. చనిపోయినా వారిని అంత్యక్రియలు గ్రామలో పడమర దిక్క తీసుకుబోయి చేస్తున్నారట.అదే ఊళ్లో మరొకరి చావుకు కారణమవుతోందని కొందరు గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. పడమర దిక్కు కాకుండా తూర్పు దిక్కుకు పోయి అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా జంట చావులు ఉండవనే నమ్మేవారు లేకపోలేదు. గ్రామ పంచాయతీ మరణ ధ్రువీకరణ పుస్తకంలో ప్రతిపేజీలో ఈ జంట చావులే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి నుంచి వారం వ్యవధిలో రెండు మరణాలు నమోదైనట్టు లెక్కలున్నాయి. ఒకరు చనిపోతే, 24 గంటల వ్యవధిలో మరొకరు చనిపోతున్నారట ఏళ్ల తరబడి రికార్డుల్లోనూ ఇదే కొనసాగుతోం
Tags:    

Similar News