ప్రియురాలి కోసం మాజీ ప్రేమికుడి ఫైట్..

Update: 2018-09-03 06:54 GMT
 సంవత్సరం , రెండేళ్లు కాదు.. ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. ఏదో ఒక్క విషయంలో తేడా వచ్చింది. ఆ అమ్మాయి  తన ప్రియుడి ప్రవర్తన నచ్చక బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత తన స్నేహితుడి వద్దకు వచ్చేసింది. కడుపు మండిన ఆ భగ్ర ప్రేమికుడు  అమ్మాయి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశాడు..

విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ డీప్ గా ప్రేమించుకున్నారు. ఇటీవల రేవంత్ వైఖరి నచ్చక అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 అరోరాకాలనీలో ఉంటున్న స్నేహితుడు అఖిల్(26) రూములో ఉంటోంది.  అఖిల్ ఓ కంపెనీలో  కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు..

అయితే తన లవర్ వేరో వ్యక్తి దగ్గర ఉండడాన్ని జీర్ణించుకోలేని రేవంత్ అక్కడి నుంచి తన వద్దకు రాకపోతే అంతుచూస్తానని ప్రియురాలిని బెదిరించాడు. శనివారం రాత్రి అఖిల్ కు ఫోన్ చేసి తన లవర్ ను పంపించాలని హెచ్చరించాడు. వినకపోవడంతో ఆదివారం రాత్రి 30మందిని తీసుకొచ్చి అఖిల్ ఇంటి వద్ద పెద్ద గొడవ చేశాడు.  అఖిల్ కు రేవంత్ కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో అఖిల్ - అతడి స్నేహితుడికి గాయాలయ్యాయి. బాధితురాలు రేవంత్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రేవంత్ - అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News