కరోనా భయం ప్రపంచాన్ని పట్టుకుంది. అది సోకితే చావడమే అన్నట్టుగా కొందరు జనం భయపడి ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు. ఇప్పటికీ బయట జనసంచారం తగ్గింది. అయితే యువకులను ఈ వ్యాధి ఏం చేయడం లేదు. వారికి బలమైన రోగనిరోధక శక్తి ఉండడంతో రక్షణగా నిలుస్తోంది. దీంతో దీన్నే కొందరు యువత అవకాశంగా మలిచుకున్నారు. బడా బాబుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు.
అమెరికాలోని ఇదహోంలో గల బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థుల బాగోతం ఒకటి బయటకు వచ్చింది. చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థుల తమ ఆరోగ్యాలతోనే చెలగాటం ఆడుతున్న వైనం వెలుగుచూసింది.ఈ వ్యవహారం సంచలనమైంది.
కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా కూడా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం కరోనాను పెట్టుబడిగా మార్చేసుకున్నారు. కాసుల కోసం కరోనాను అంటించుకుంటున్నారు. తర్వాత ఆ వ్యాధి నుంచి కోలుకొని ప్లాస్మా దానం పేరుతో వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారు.
కరోనాకు మందులు, చికిత్స లేకపోవడంతో ప్రాణం పోయే దశలో ఉన్న వారికి ప్లాస్మా చికిత్సతోనే బతికిస్తున్నారు. దీంతో ఈ విద్యార్థులు ప్లాస్మా డోనర్లుగా అవతారం ఎత్తి డబ్బులకు అమ్ముకుంటున్నారు. ఈ విషయం సంచలనంగా మారడంతో విషయం తెలిసి షాక్ అయిన బ్రిఘం యంగ్ వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు.
బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు కరోనాను అంటించుకొని కోలుకొని ఆ తర్వాత ప్లాస్మాను హాస్పిటల్స్ కు భారీ రేట్లకు అమ్ముకుంటున్నట్టు తెలిసింది. దీంతో విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తామని స్పష్టం చేశారు. ఇలా 119మంది విద్యార్థులు దందా చేస్తున్నట్టు వెలుగుచూసింది. ఒక్కో యూనిట్ కు 100 నుంచి 200 డాలర్లు చొప్పున అమ్ముకున్నారని తెలిసింది.