ప్రస్తుతం భారత్ - పాక్ ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో త్వరలో యుద్దం రావొచ్చని కొందరంటుంటే.. యుద్దం ఎందుకు? కూర్చుని మాట్లాడుకుంటే పనైపోతుందని మరికొందరు సలహాలిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? పాక్ ఎలా కాలుదువ్వాలనుకుంటుంది? అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు, పాక్ కు వ్యతిరేకతా ఏ స్థాయిలో ఉండబోతుంది? వంటి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా... తాజాగా ఈ విషయంపై యుద్దమే కరెక్ట్ అంటున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి.
తాజాగా ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వులో ఈ ఉద్రిక్త పరిస్తితులపై స్పందించిన బీజేపీ నేత - రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి... యుద్దం తప్ప మరో దారి లేనట్లుగా కనిపిస్తోందని.. పాక్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ పెరుగుతుండటం, తాజాగా బారాముల్లాలో మరోసారి ఉగ్రవాదులు దాడి చేయడంతో స్వామి పైవిధంగా స్పందించారు. భారతదేశ మౌనాన్ని, మంచితనాన్ని పాకిస్థాన్ తప్పుగా అర్థం చేసుకుంటోందని, వారికి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఇప్పుడు ఉందని అన్నారు.
ఇదే క్రమంలో గత ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టిన స్వామి... యూపీఏ పాలనలో వృద్ధి చెందిన స్లీపర్ సెల్స్ ఇప్పుడు దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. ఇదే క్రమంలో కొందరు ఉగ్రవాదులకు ఏకంగా ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని అంటున్న స్వామి... బారాముల్లావంటి దాడులకు యూపీఏ వైఫల్యాలే కారణం అని ఆరోపించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ కళాకారులకు మద్దతుగా మాట్లాడిన సల్మాన్ ఖాన్ ను పరోక్షంగా ప్రస్తావించిన స్వామి... పాకిస్థాన్ తో మనం ఘర్షణ పడుతున్నామన్న విషయం స్పష్టంగా గుర్తించాలని.. పాకిస్థాన్ నుంచి ఎవరినీ రానివ్వకూడదని తేల్చి చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/