నారాయణమూర్తి వైఫ్ కి పదవిచ్చిన బాబు

Update: 2017-02-10 07:12 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అక్రమాస్తుల కేసులో అడ్డంగా బుక్ అయిన శేఖర్ రెడ్డి (తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్)ని టీటీడీ పాలకమండి సభ్యుడిగా తప్పించిన సంగతి తెలిసిందే. ఎవరో చెబితే తాను పదవి ఇచ్చినట్లుగా అప్పట్లో చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీటీడీ పాలకమండలి సభ్యుడి పోస్ట్ ను ఎవరో చెబితే ఇచ్చేయటం ఏమిటని? మరీ..అంత బాధ్యతారాహిత్యమా అని బాబును విమర్శించిన వారు లేకపోలేదు.

ఖాళీగా ఉన్న ఆ పోస్ట్ ని తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్.. సుధా నారాయణమూర్తిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం మూడు నెలలు మాత్రమే ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. మరో మూడు నెలల్లో కొత్త పాలక మండలిని ఎన్నుకోవాల్సి ఉంది. అప్పటివరకూ ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

టీటీడీ పాలకమండలి సభ్యుడి పోస్ట్ కు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇలాంటి పదవికి సహజంగా రాజకీయ నేతలకు.. లేకుంటే వారి సిఫార్సు మీద పారిశ్రామికవేత్తలకు ఇవ్వటం జరుగుతుంది. తాజా ఎంపిక చూసినప్పుడు ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఎవరు చెబితే సుధానారాయణమూర్తిని టీటీడీ పాలకమండలి బోర్డు సభ్యురాలిగా ఎంపిక చేశారో కానీ.. ఈసారి మాత్రం బాబు ఛాయిస్ బాగుందన్న మాట వినిపిస్తోంది.

పెద్ద ఎత్తునసేవాకార్యక్రమాలు నిర్వర్తించటం.. ఎలాంటి మచ్చలేని వ్యక్తిత్వంతోపాటు.. బిల్ గేట్స్ స్థాపించిన గేట్స్ ఫౌండేషన్ లో ప్రజారోగ్య విభాగంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. మరి.. ఈ పోస్ట్ పుణ్యమా అని  అయినా.. .ఇన్ఫోసిన్ నుంచి ఏదైనా పెద్ద కార్యాలయాన్ని ఏపీకి బాబు తీసుకొస్తారేమో చూడాలి. 


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News