కరోనాను నియంత్రించడానికి లాక్ డౌన్ పెడితే దాని వల్ల వైరస్ నుంచి తప్పించుకున్నాం కానీ ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చిపడుతోంది. ఇంట్లో ఉండడం వల్ల పుష్టిగా తింటూ కూర్చోవడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇక కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంట్లోనే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా వ్యాయామం లేక జీవక్రియ వ్యవస్థ గందరగోళంగా మారుతోంది.
ఫలితంగా ఈ లాక్ డౌన్ నుంచి మధుమేహం, దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులతో బాధపడేవారికి ప్రమాదం ఎక్కువైందని ఓ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది.
ఈ లాక్ డౌన్ సమయంలో మధుమేహం కలిగిన రోగుల రక్తంలో షూగర్ లెవల్స్ 20శాతం పెరిగినట్లు ఆరోగ్య సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 8200మంది షుగర్ వ్యాధి గ్రస్తులను బీటో అనే ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థ సర్వే చేసింది. లాక్ డౌన్ ముగియక ముందు 135 ఎంజీ/డీఎల్ ఉన్న షుగర్ లెవల్స్.. ఇప్పుడు 165 ఎంజీ/డీఎల్కు పెరిగాయని వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందని తెలిపింది.
ఒత్తిడి, ఆందోళన, జీవనశైలిలో మార్పులు, అలవాట్లు, శారీరక శ్రమ లేక రక్తంలో షూగర్ లెవల్స్ పెరిగాయని తేలింది. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లో ఇది మరింత పెరిగినట్టు సర్వేలో తేలింది.