సుజనా చౌదరీ కోర్టు గుమ్మం తొక్కాల్సాందే

Update: 2016-03-06 04:54 GMT
కేంద్రమంత్రి సుజనా చౌదరికి కోర్టు చిక్కులు తీరేటట్లు కనిపించట్లేదు. మారిషస్ బ్యాంకు బకాయిలకు సంబంధించిన రూ.100కోట్ల ఇష్యూ ఆయన్ను వీడని నీడలా వెంటాడుతోంది. సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా.. ఆయనకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో తాజాగా ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

మోసపూరిత హామీలతో తమను మోసం చేశారంటూ మారిషస్ బ్యాంకు పెట్టిన కేసును తాజాగా విచారించిన నాంపల్లి కోర్టు.. ఈ కేసులో నిందితులైన అందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చింది. ఈ కేసులో నిందితులైన వారిలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఉండటం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన సైతం కోర్టుకు రావాల్సిందేనని.. ఎలాంటి మినహాయింపులు లేవని కోర్టు స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సుజనా అండ్ కో అంతా మార్చి 22న నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందే. మొత్తమ్మీదా సుజనా కోర్టు గుమ్మం తొక్కనున్నారన్న మాట.
Tags:    

Similar News