తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ను వాడుకుని వదిలేసిందా.. ? కాపుల ఓట్ల కోసం ఆయనతో ప్రచారం చేయించి గత ఎన్నికల్లో లాభపడిన టీడీపీ ఇప్పుడు పవన్ ను తొక్కాలని చూస్తుందా? ... చాలామంది ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదే. పవన్ అభిమానులు కూడా అదే ఫీలవుతున్నారట. అయితే.. టీడీపీ నేతలు మాత్రం అదేమీ లేదంటున్నారు. పవన్ ను తామేమీ దూరం పెట్టలేదని.. పవన్ ను వదులుకోవాలని కూడా తామేమీ అనుకోవడం లేదని అంటున్నారు.
కేంద్ర మంత్రి - టీడీపీ నేత సుజనా చౌదరి రీసెంటుగా ఈ విషయంపై మాట్లాడుతూ పవన్ ను తామేమీ దూరం పెట్టలేదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ పట్టుదలగా ఉన్నారని... ఆ విషయంలో స్వల్పంగా భావ వైరుధ్యాలు ఉన్నమాట వాస్తవమే కానీ పవన్ తో తమ పార్టీ ఏమీ వివాదం పెంచుకోలేదన్నారు.
తాము కూడా ప్రత్యేక హోదా కావాలనే కోరుకున్నామని.. అయితే.. హోదా కంటే ప్యాకేజీ వల్ల కలిగే లాభాలే ఎక్కువగా ఉండడంతో కేంద్రం ప్రతిపాదనకు సరేనన్నామని ఆయన చెప్పారు. పవన్ మాత్రం ఇంకా హోదా కోసం పట్టుబడుతున్నారని.. ప్యాకేజీకి అంగీకరించినందున తమను ఆయన వ్యతిరేకిస్తే వ్యతిరేకించి ఉండొచ్చన్నట్లుగా మాట్లాడారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/