ఏపీలోని తెలుగు తమ్ముళ్లకు పెద్ద కష్టమే వచ్చి పడింది. గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నడూ జరగనంతా భారీ డ్యామేజ్ ఒకే ఒక్క మాటతో జరిగిందని తమ్ముళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చాకచక్యంగా అణిచి వేయటమే కాదు.. జల్లికట్టు స్ఫూర్తితో విశాఖలో నిర్వహించతలపెట్టిన మౌన నిరసనను పోలీస్ బలంతో అణగదొక్కేసిన తీరు తెలిసిందే.
ఏపీ విపక్ష నేత జగన్ ను బూచిగా చూపిస్తూ..మౌన ప్రదర్శనకు అనుమతిస్తే.. జరగరానిది జరిగిపోతుందంటూ ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వారిని సామదాన దండోపాయాల్ని ప్రయోగించి.. ప్రత్యేక హోదా మీద ఏపీలోఎలాంటి సెంటిమెంట్ లేదన్న విషయాన్ని చాటి చెప్పేందుకు చంద్రబాబు అండ్ కో పడిన తిప్పలు అన్నిఇన్ని కావు.
ఇంతలా పడిన కష్టమంతా.. కేంద్రమంత్రి సుజనా చౌదరి పుణ్యమా అని మొత్తంగా పోయిందని చెబుతున్నారు. హోదా గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బుద్ధిగా సమాదానం చెబితే పోయేదానికి.. పందుల పోటీలతో పోల్చేసి అందరి ఆగ్రహానికి గురి కావటమే కాదు.. తెలుగు తమ్ముళ్ల నోట మాటరాకుండా చేశారు. అది మొదలు.. టీడీపీ నేతలు ఎవరితో మాట్లాడినా.. సుజన ప్రస్తావన తీసుకురావటం.. ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించటంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సుజనా అలా ఎలా మాట్లాడతారంటూ అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానం ఉండటం లేదని వాపోతున్నారు.
అప్పటికి సుజనా చేసిన వ్యాఖ్యలు చేసే డ్యామేజ్ ను గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు.. వెనువెంటనే రియాక్ట్ అయి.. అక్షింతలు వేసినప్పటికీ సుజనా మాటల ప్రభావం ఏపీ ప్రజల్లోకి వెళ్లకూడదని రీతిలో వెళ్లిందని వాపోతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా తొక్కేసిన తమను.. తన నోటి మాటతో సుజనా ప్రజల ముందు అడ్డంగా బుక్ చేశారని వాపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/