రోహిణికార్తె ఎండల గురించి అందరూ చాలా భయం.. భయంగా చెబుతుండటం తెలిసిందే. ఈ సమయంలో ఉండే ఎండ తీవ్రతకు పెద్దపెద్ద బండలు సైతం బద్ధలు బద్దలు అవుతుంటాయని అంటారు. రోకళ్లు సైతం పగిలిపోయే ఎండలు రోహిణికార్తెలో ఉంటాయని చెప్పటం తెలిసిందే. తాజాగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అలాంటి సంఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
గడిచిన కొద్దిరోజులుగా భగభగలాడుతున్న సూర్యతాపానికి కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న వేళ.. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురంలోని దశాబ్దాల తరబడి పంట నూర్పిడికి ఉపయోగించి కంకుల గుండు ఎండ తీవ్రతకు పగుళ్లు ఇచ్చి నిలువునా చీలిపోయింది. భారీగా ఉండే ఈ రాతి శిలను సైతం తాజా ఎండలు చీలిపోయేలా చేశాయంటే.. భానుడి భగభగలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.