వర్క్ ఫ్రం హోంపై గూగుల్ కీలక ప్రకటన

Update: 2021-09-02 02:30 GMT
కరోనా నేపథ్యంలో ఒకరినొకరు టచ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో 6 మీటర్ల దూరం ఉండాలని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు తప్ప మిగతా రంగాలన్నీ మూసివేశారు.. అయితే కేసులు కాస్త తగ్గుతున్న పరిణామంలో డిస్టేన్స్ ను మెయింటెన్ చేస్తూ  వ్యాపార కార్యకలాపాలు సాగించుకుంటున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. కానీ  కొన్ని కంపెనీలు మాత్రం తమ భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రం హోం ను ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికీ ఆయా కంపెనీలో ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్న వర్క్ ఫ్రం హోం చేస్తున్నా ఆయా ఉద్యోగుల కదలికలు ఎప్పటికప్పుడు యాజమాన్యం కనుసన్నల్లోనే ఉంటున్నాయి.

కంపెనీ యాజమాన్యాలు గత మార్చిలో  వర్క్ ఫ్రం హోం మొదలుపెట్టాయి.  ఉద్యోగులు పనిచేసేంది ఇళ్లల్లో  అయినా వారు పనిచేసే ప్రదేశంలో ఎప్పుడూ ఆన్ లైన్ లోనే ఉంటూ పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించారు.

ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 80 వేలకు పైగా తాము పని చేయడం కంటే ఆఫీసుకు వస్తేనే బెటర్ అన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. అయితే 2.4 లక్షల మంది ఐటీ ఉద్యోగుల ఇళ్లల్లో  పనులు చేస్తున్నారు. కొంతమంది ఆఫీసులకు వెళుతున్నారు.

కరోనా తగ్గడంతో వర్క్ ఫ్రం హోం కొనసాగించడంపై మల్లగుల్లాలు పడుతున్న కార్పొరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీసుకైనా.. ఇంట్లోనుంచి అయినా పనిచేయాలనే అంశంపై క్లారిటీ ఇస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే నంబర్ 1 సెర్చింజన్ గూగుల్ సైతం స్పందించింది.

వర్క్ ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. గూగుల్ సైతం సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. ఆ తర్వాత ఈ గడువును అక్టోబర్ కు పొడిగించింది. తాజాగా వర్క్ ఫ్రం హోంపై గూగుల్ కీలక ప్రకటన చేసింది.

కరోనా డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తున్న వేళ గూగుల్ సంస్థ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకూ వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పనిచేయాలనే నిబంధనను ఐచ్చికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు. జనవరి 10 తర్వాత వర్క్ ఫ్రం హోంపై నిర్ణయిస్తామని తెలిపారు.
Tags:    

Similar News