అప్పట్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు.. ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఫిర్యాదు చేస్తూ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వాన్ని అస్తిరపరుస్తున్నారంటూ లేఖలో సీఎం జగన్ ఆరోపించారు. ఆ లేఖ ఎంత రచ్చ చేసిందో చూశాం.
ఇక తదనంతరం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేలు బదిలీకావడం.. సీఎం జగన్ వల్లే ఇది జరిగిందన్న ప్రచారం మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక తాజాగా చీఫ్ జస్టిస్ జగన్ లేఖ విషయంలో ఆ సుప్రీం జడ్జిని వివరణ కోరారని కథనాలు ప్రచారమవుతున్నాయి.
ఈ వార్తలపై తాజాగా స్వయంగా సుప్రీం కోర్టే జోక్యం చేసుకొని స్పష్టతనిచ్చింది. సుప్రీ జడ్జిని వివరణ కోరారంటూ వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సదురు వార్తల్లో నేరుగా సుప్రీంకోర్టునే ప్రస్తావిస్తూ కథనాలు సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో అంతర్గతంగా సాగే ఈ ప్రక్రియను మీడియా ఎలా రిపోర్టింగ్ చేస్తోందని సుప్రీం ప్రశ్నించింది.
జాతీయ మీడియాలో వార్తలు, ప్రచురుణ, ప్రసారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు .. మా పరిధిలో అంతర్గత వ్యవహారాలన్నీ అత్యంత గోప్యంగా సాగుతాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాబోవంటూ తెలిపింది. తమ కథనాలకు విశ్వసనీయతను ఆపాదించడానికి సుప్రీంను కోట్ చేయడం మానుకోవాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంలో జరిగేదంతా రహస్యంగానే ఉంటుందని.. దాన్ని మీడియా వెల్లడించడం జరగదని స్పష్టం చేసింది.