ఎన్నిక‌ల వేళ రిజ‌ర్వేష‌న్లపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

Update: 2018-12-07 11:27 GMT
తెలంగాణ‌లో పోలింగ్ జ‌రుగుతున్న వేళ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. అసెంబ్లీని రద్దు చేసిన ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న టీఆర్ ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దేశ అత్యున్నత ధర్మాసం అయిన సుప్రీంకోర్టు ముస్లింలు - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు వేసిన పిటీషన్స్ 50శాతం మించరాదని స్పష్టం చేసింది. త‌ద్వారా తెలంగాణ  ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.

ముస్లింలు - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న రిజర్వేషన్ల పెంపున‌కు సంబంధించిన పిటిష‌న్‌ ను సుప్రీం కోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ...రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని - ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం - గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం... రిజర్వేషన్లను పెంచడం కుదరదని - రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది. కాగా ముస్లింలకు - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్స్ డిమాండ్ తో టీఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఆనాడు పూర్తిస్థాయి అధికారంతో వున్న టీఆర్ ఎస్ ప్రభుత్వానికి లేద‌ని వెల్ల‌డించింది.


Tags:    

Similar News