జాతీయ స‌ర్వే...వైసీపీకి 104 సీట్లు!

Update: 2018-10-20 07:27 GMT
2019 ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఉన్న ప‌ళంగా ఎన్నిక‌లు జ‌రిగినా...టీడీపీ క‌న్నా వైసీపీకి దాదాపు 10 శాతానికి పైగా ఓట్లు పోల‌వుతాయ‌ని జాతీయ స‌ర్వేలు తేల్చి చెప్పాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో జాతీయ స‌ర్వేలో కూడా వైసీపీకి అత్య‌ధిక ఓట్లు పోల‌వుతాయ‌ని వెల్ల‌డైంది. ప్రాంతాల వారీగా ఏపీలో వైసీపీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పేందుకు ఈ స‌ర్వే నిద‌ర్శ‌నం. ఏపీలో ఆయా ప్రాంతాల వారీగా వైసీపీ - టీడీపీ - జ‌న‌సేల‌కు పోల‌య్యే ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. వైసీపీకి ద‌రిదాపుల్లో కూడా టీడీపీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక జ‌న‌సేన‌కు నామ మాత్రంగానే ఓట్లు పోల‌వుతాయ‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది. వైసీపీకి 104 సీట్లు ద‌క్కుతాయ‌ని ఆ స‌ర్వేలో వెల్ల‌డైంది. ఇక టీడీపీకి 68 సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలో తేలింది. జ‌న‌సేన‌కు 2 - బీజేపీ ఒక సీటు వ‌స్తాయ‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్ మాత్రం ఖాతా తెర‌వ‌ద‌ని స‌ర్వే చెబుతోంది. ఆ జాతీయ స‌ర్వే  వివ‌రాలు య‌థాత‌ధంగా.....

జాతీయ ప్రైవేటు స‌ర్వే ఫ‌లితాలు

రాయ‌లసీమ‌: వైసీపీ: 70 శాతం - టీడీపీ: 30 శాతం

నెల్లూరు: వైసీపీ: 90 శాతం - టీడీపీ: 10 శాతం

ప్ర‌కాశం: వైసీపీ: 60 శాతం - టీడీపీ: 40 శాతం

గుంటూరు & కృష్ణా: వైసీపీ: 40 శాతం - టీడీపీ: 60 శాతం

ఉభ‌య గోదావ‌రి జిల్లాలు: వైసీపీ: 50 శాతం - టీడీపీ: 50 శాతం

ఉత్త‌రాంధ్ర‌: వైసీపీ: 55 శాతం - టీడీపీ: 45 శాతం

వైసీపీ ఓట్ల షేర్ : 56 శాతం

టీడీపీ ఓట్ల షేర్ : 37.5 శాతం                    

జ‌న‌సేన ఓట్ల షేర్ : 4.5 శాతం

కాంగ్రెస్ ఓట్ల షేర్: 1 శాతం

బీజేపీ ఓట్ల షేర్: 1 శాతం

సీట్ల అంచ‌నా:వైసీపీ:104

టీడీపీ:68

జ‌న‌సేన‌:2

కాంగ్రెస్: 0

బీజేపీ:1
Tags:    

Similar News