సుష్మకు కిడ్నీ దొరికింది..

Update: 2016-12-07 07:50 GMT
మూత్రపిండాలు పాడై ఎయిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ దాత దొరికినట్టు తెలుస్తోంది. ఆమెకు కిడ్నీ దానమిచ్చేందుకు ఇప్పటికే చాలామంది ముందుకొచ్చినా ఏదీ ఆమెకు సరిపడలేదు. ఆమెకు సరిపడే బ్లడ్ గ్రూప్ - కిడ్నీ సైజ్ ఉన్న దాత ఇప్పుడు లభించినట్లు సమాచారం. ఈవారంలోనే ఆమెకు కిడ్నీ మార్పిడి జరుగుతుందని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
    
కాగా ప్రస్తుత కిడ్నీ దాతతో ఆమెకు ఎలాంటి పరిచయం, బంధుత్వమూ లేదట. ఆమె బంధువర్గం, దగ్గరి స్నేహితులు - అభిమానులు ఎంతో మందిని పరిశీలించినా కిడ్నీ సరిపడలేదు..  ఎలాంటి బంధుత్వం లేని వ్యక్తి కిడ్నీ సరిపడింది. కాగా, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి పరిస్థితిలో గత నెల రెండో వారం నుంచి సుష్మా స్వరాజ్ ఆసుపత్రికే పరిమితమయ్యారు.
    
ఆమెకు పరీక్షలన్నీ చేసిన తరువాత వీలైనంత త్వరలో కిడ్నీ మార్పిడి పూర్తి చేస్తారు. కాగా.. ఏపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా సుష్మకు కిడ్నీ దానమిచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News