ఆప్షన్ కోల్పోయిన రాహుల్

Update: 2015-08-13 10:27 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఆప్షన్ కోల్పోయారు. ఒకవేళ పొరపాటున ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అప్పుడు ప్రతిపక్షాలు గందరగోళం చేస్తే దానిని అదుపు చేయడానికి ఎటువంటి అవకాశాన్నీ ఉంచుకోలేదు. సాధారణంగా అన్ని పార్టీలూ ఈ ఆప్షన్ ను ఉంచుకుంటాయి. అధికార పక్షం తప్పు చేయడం సమజమన్నది వాటి భావన. అందుకని రాజకీయ లబ్ధి కోసం కొంత వరకూ ఆందోళన చేస్తాయి. తప్పితే తెగే వరకూ లాగవు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తోంది.

లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్ స్వయంగా రాహుల్ వద్దకు వెళ్లారట. ఆయన చేతులు పట్టుకుని.. బేటా నా మీద ఎందుకు కోపం అని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా రాహులే చెప్పారు. భారీ ఆరోపణలు వస్తే తప్పితే ఇటువంటి చిన్న చిన్న ఆరోపణలు వచ్చినప్పుడు సర్వ సాధారణంగా విషయాన్ని తెగే వరకూ లాగరు. సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు తదితరులు కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. రాహుల్ తోనూ మాట్లాడినట్లు సాక్షాత్తూ ఆయనే చెప్పారు. ఇక ములాయం, లాలు, మమత వంటి మధ్యవర్తులకూ ఎటువంటి భాగస్వామ్యం లేకుండా చేశారు. లలిత్ మోదీ అంశాన్ని తెగే వరకూ లాగడం ద్వారా భవిష్యత్తులో తన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ తానే కోల్పోయింది.

ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాహుల్ కానీ మరొకరు కానీ ప్రధాని అయితే.. అప్పుడు పార్లమెంటును స్తంభింపజేసినప్పుడు సమస్యను పరిష్కరించడానికి ఎవరినీ, ఎటువంటి అవకాశాన్ని మిగుల్చుకోకుండా చేసుకుంది.  ఇది రాజకీయాల్లో ఈ వైఖరి ప్రమాదకరమే. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి మరీ ముఖ్యంగా...
Tags:    

Similar News