ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్‌కు ఇబ్బంది పెట్టేంత సినిమా ఉన్న నేతలు తెలంగాణ గడ్డ మీద కనిపించరని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు కీలకపాత్ర పోషించిన కోదండం మాష్టారి ఆచితూచి అడుగులు వేసే ధోరణితో వ్యవహరించటంతో ఆయన కారణంగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి కనిపించదు. ఇక.. మిగిలిన నేతలు చాలామందే ఉన్నా.. వారిని తన నోటి మాటలతో.. చేతలతో నిలువరించే సత్తా కేసీఆర్ కు ఉండనే ఉంది.
ఈ పరిస్థితే కేసీఆర్ కు రాజకీయంగా చికాకులు ఎదురుకాకుండా ఉండేలా చేస్తోంది. అయితే.. ఈ మధ్యన ఒక స్వాములోరు మహా యాక్టివ్ అయిపోతున్నారు. తనను తాను యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ గా ఫీలయ్యే స్వామివారి పుణ్యమా అని కేసీఆర్ కు కొత్త తలనొప్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఘాటు వ్యాఖ్యలతో పరిమితమైన అంశాల్ని తెర మీదకు తెస్తూ.. ఇప్పుడిప్పుడు ప్రజల దృష్టిని తనవైపునకు మళ్లేలా చేస్తున్నారు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి.
మిగిలిన స్వాములోర్లకు భిన్నంగా పలు అంశాలపై తన వాయిస్‌ను వినిపిస్తున్నారు. తాజాగా ఆయనో ఆసక్తికరంశాన్ని తెర మీదకు తెచ్చారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు రావాలంటే నిజామాబాద్.. అదిలాబాద్.. హైదరాబాద్ వంటి జిల్లాలకు ఉన్న బాద్ లు పోవాలన్న పాయింట్ ను పైకి తీశారు. పేర్ల వెనుక ఉన్న బాద్ లు తీసేసి.. గతంలో ఉన్న ఇందూరు.. భాగ్యనగరం లాంటి పేర్లు పెట్టాలన్నారు. పేర్లు మార్చటం పెద్ద పనే కాదని.. చాలా సులువైన పనిగా ఆయన అభివర్ణ్ిస్తున్నారు. గతంలో రాష్ట్రాల పేర్లనే మార్చేశారని ఆయన గుర్తు చేస్తున్నారు.
మహారాష్ట్రలో శివాజీ.. మరో రాష్ట్రంలో పుట్టి ఝూన్సీ లక్ష్మిబాయి.. ఇతర రాష్ట్రాలకు చెందిన రాణా ప్రతాప్.. సుభాష్ చంద్రబోస్.. భగత్ సింగ్ లు పుట్టారని.. కానీ తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి శివాజీ.. ఝూన్సీ లక్ష్మిబాయిలా రజాకార్ల ఆగడాల్ని అడ్డుకున్న వారేనని చెప్పారు. భారత్ లో విశ్వగురువు స్థానంలో నిలబెట్టాలంటే యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ లాంటోళ్లు అవసరమన్న వ్యాఖ్య చేశారు. స్వాములోరి శ్లేష మీకిప్పటికే అర్థమై ఉంటుందిగా.