ర‌స‌కందాయంలో తాడిప‌త్రి స‌మ‌రం.. చైర్మ‌న్ ఫ‌లితం అలాగే తేలుస్తారా?

Update: 2021-03-18 05:30 GMT
ఏపీలో జ‌రిగిన  మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ అఖండ విజ‌యం సాధించింది. కానీ.. అనంత‌పురం తాడిప‌త్రిలో టీడీపీ మెజారిటీ స్థానాలు సాధించింది. మొత్తం 36 స్థానాలు ఉన్న తాడిప‌త్రి మునిసిపాలిటీలో 18 చోట్ల టీడీపీ గెల‌వ‌గా.. వైసీపీ 16, సీపీఐ, స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక్కో చోట విజ‌యం సాధించారు. అయితే.. ఎంపీ, ఎమ్మెల్యే ఉండ‌డంతో వారి ఎక్స్ అఫీషియో ఓట్ల‌తో వైసీపీ బ‌లం కూడా 18కి పెరిగింది. ఈ విధంగా రెండు పార్టీలూ స‌రిస‌మాన‌మైన సీట్లతో మునిసిప‌ల్ చైర్మ‌న్ సీటు కోసం పోటీప‌డుతున్నాయి.

అయితే.. ఫ‌లితం వెలువ‌డిన వెంట‌నే టీడీపీలో గెలిచిన‌ 18 మందిని, సీపీఐ, స్వ‌తంత్ర అభ్య‌ర్థిని క‌లిపి మొత్తంత 20 మందిని క్యాంపున‌కు త‌ర‌లించారు జేసీ బ్ర‌ద‌ర్స్‌. చైర్మ‌న్‌ ఎన్నిక జ‌రిగే వ‌ర‌కూ ఈ క్యాంపు కంటిన్యూ చేసి, స‌రిగ్గా ఎన్నిక రోజునే తాడిప‌త్రిలో ల్యాండ్ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌.

అయితే.. తాడిప‌త్రిని సీరియ‌స్ గా తీసుకున్న వైసీపీ.. ఎలాగైనా చైర్మ‌న్ ప‌ద‌వి సాధించాల‌ని చూస్తోంది. దీంతో.. వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ఇందులో భాగంగా.. తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని మైనారిటీల‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ట జ‌గ‌న్ పార్టీ నేత‌లు. మునిసిపాలిటీలోని మొత్తం 36 మందిలో 11 మంది కౌన్సిల‌ర్లు ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఐదుగురు, టీడీపీ క్యాంపులో ఉన్న ఒక్క‌రు కూడా మైనారిటీనే. వారికి ఏకంగా చైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేస్తోంద‌ట వైసీపీ.

దీంతో.. టీడీపీ అద‌నంగా మ‌రో ప్ర‌య‌త్నం కూడా మొద‌లు పెట్టింది. జేసీల బంధువు, ఎమ్మెల్సీ అయిన దీప‌క్ రెడ్డితో ఎక్స్ అఫీషియో ఓటును తాడిప‌త్రిలో వేయించాల‌ని చూశార‌ట‌. అంత‌కు ముందు వేరే చోట ఉన్న ఆయ‌న ఓటును.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో తాడిప‌త్రి ప‌రిధిలోకి మార్పించార‌ట‌. ఆ విధంగా.. ఇక్క‌డ ఎక్స్ అఫీషియో ఓటుకు ప్లాన్ చేశార‌ట‌. కానీ.. అది వ‌ర్కువ‌ట్ అయ్యేలా క‌నిపించ‌ట్లేద‌ని స‌మాచారం. ఎమ్మెల్సీగా నామినేట్ కావ‌డానికి ముందు ఎక్క‌డ ఓటు ఉంటే అక్క‌డే లెక్క‌లోకి వ‌స్తుంద‌ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి మార్చుకొని చైర్మ‌న్ ఎన్నిక‌లో పాల్గొన‌డం నాట్ పాజిబుల్ అని కోర్టు చెప్పిందంటూ వార్త‌లు వ‌స్తున్న‌యి.

మ‌రి, ఎన్నిక‌లోగా క్యాంపు దాటి వచ్చి వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారా? లేదంటే.. అధికారులు టాస్ ద్వారా ఫలితం తేలుస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News