కాంగ్రెస్ డాక్టర్లు..అందుకే లొల్లి చేస్తున్నారట..!

Update: 2020-04-09 07:30 GMT
తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఏకంగా 500కు చేరువ అవుతోంది. సీఎం కేసీఆర్ రెండు రోజుకోసారి సమీక్ష నిర్వహిస్తూ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. వసతులు కల్పిస్తూ కరోనాకు సంబంధించిన సకల సౌకర్యాలు చూసుకుంటున్నారు.

అయితే ఇంత చేస్తున్న ఇటీవల మీడియాలో డాక్టర్లకు పీపీఈ కిట్లు కొరత ఉన్నాయని వార్తలు వచ్చాయి. జూనియర్ డాక్టర్లు కూడా ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. దీంతో కేసీఆర్ సైతం వీటిని ఖండించి ఓ పత్రికపై మండిపడ్డారు.

తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. కొంతమంది జూనియర్ డాక్టర్లు ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారని.. ఇది కాంగ్రెస్ బ్యాచ్ అని.. విరాళాలు ఇస్తే నొక్కేద్దామనే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారేమో అంటూ విమర్శించారు. ఇప్పటికే 5 లక్షల పీపీఈ కిట్లు ఆర్డర్ ఇచ్చామని.. ఇంకా కొన్ని రావాల్సి ఉందని చెప్పారు. తాము ఇంత చేస్తుంటే ఇలా ప్రకటనలు జూనియర్ డాక్టర్లు ఇవ్వడం సబబేనా? అని ప్రశ్నించారు.

సమస్యను ప్రభుత్వానికి - మంత్రి ఈటలకు చెబితే పరిష్కరిస్తామని.. అనవసర ఆరోపణలు చేస్తూ వారికే నష్టమని మంత్రి తలసాని హెచ్చరించారు. కేసీఆర్ తిట్టడం లో తప్పు ఏమీ లేదని.. బుద్ది జ్ఞానం లేని కాంగ్రెస్ వాళ్లతో ఏం మాట్లాడుతామని విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News