తలసానినికి తప్పించడానికే కేసీఆర్ సుముఖం..?!

Update: 2015-07-15 17:14 GMT
తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రి పదవి కోల్పోనున్నాడా? ఆయన మంత్రి పదవి ముచ్చట మూడు నాళ్ల ముచ్చటే కానుందా? ప్రస్తుత పరిస్థితుల్లో తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించడమే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నాడా? త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో ఈ ఆసక్తికరమైన మార్పు జరగనుందా?! తెలంగాణ రాజకీయ వర్గాల మధ్య ఈ అంశం పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మరి తలసాని ఎంతో ముచ్చట పడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీఆర్ఎస్ లో చేరాడు. ఇలా ఫిరాయించడం వల్ల ఎమ్మెల్యే పదవి పోతుందని తెలిసినా కూడా ఆయన లెక్క చేయక జంపింగ్ చేశాడు. అయితే అలా మంత్రి పదవిని సొంతం చేసుకొన్నా.. అటు తలసానికి కానీ.. ఆయనను చేర్చుకొన్న తెలంగాణ రాష్ట్ర సమితి వారికి కానీ ఎలాంటి ప్రశాంతతా లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి.. తెరాస తరపున మంత్రి పదవిని ఎలా చేపడతాడు? అంటూ అనేక మంది ప్రశ్నించే వారు అయ్యారు.

ఈ అంశంపై రాష్ట్రపతి వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి దీనిపై ఎలాంటి సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఇప్పటి వరకూ ఎంతోమంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినా వారెవరి విషయంలోనూ లేని ఇబ్బంది తలసాని విషయంలో మాత్రమే ఉంది. ఆయన మంత్రి పదవి చేపట్టడం వల్ల... ఆయన రాజీనామా విషయంలో డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... తలసానిని రాజీనామా చేయించాలని.. ఆయనను మళ్లీ సాధారణ ఎమ్మెల్యేగా చేసి.. ఇతర పక్షాల దాడిని తప్పించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడట. మరి తలసాని మంత్రి పదవి ముచ్చట ఏమవుతుందో చూడాలి!
Tags:    

Similar News