ఇంతటి ఆధునిక యుగంలో కూడా కొందరి బుర్రల్లో పేరుకుపోయిన మూఢత్వం చూస్తే ఆవేదనతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. వారి అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆ కూటమి 159 స్థానాలను దక్కించుకుంది. దీంతో.. అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ ఆనందంలో ఉన్నారు. సంబరాలు చేసుకున్నారు.
ఈ ఆనందంలోనే ఓ మహిళా కార్యకర్త దేవతకు మొక్కు సమర్పించుకుంది. అది అలాంటి ఇలాంటి మొక్కు కాదు.. ఏకంగా తన నాలుకను దేవతకు నైవేద్యంగా సమర్పించింది. రాష్ట్రంలో గత రెండు పర్యాయాలూ అన్నాడీఎంకే అధికారంలో కొనసాగింది. ఈ సారి డీఎంకే గెలిస్తే తాను నాలుక కోసుకొని నైవేద్యంగా పెడతానని ముత్తాలమ్మాన్ దేవతకు మొక్కిందట. ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది.
అంటే.. ఆ మహిళా కార్యకర్త లెక్క ప్రకారం.. ఆమె మొక్కితేనే డీఎంకే గెలిచిందన్నమాట. మరి, తన కోరిక తీర్చిన దేవతకు మొక్కు చెల్లించాలి కదా? అందుకే.. ఫలితాలు రాగానే వెళ్లి ఆలయం ముందు నాలుక కోసుకుందట. ఇది చూసిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి మానసిక స్థితి వారిలోని మూఢత్వానికి అద్దం పడుతోందని అంటున్నారు.