పార్టీలో ఉన్న వారికి వ్యక్తిగతం అంటూ ఉండకూడదు, ఉన్నా కూడా అది పార్టీ ఖాతాలోకే వెళ్ళిపోతోంది. గతంలో అయితే వ్యక్తిగతం, పార్టీ వ్యవహారం అని విడదీసి చూసే హుందా రాజకీయం నడిచేది. ఇపుడు అలా కాదు, ప్రత్యర్ధి పార్టీ మనుషులుగా ఉన్న వారు ఎక్కడ దొరుకుతారా అని చూసి టోటల్ పార్టీనే బుక్ చేయాలనుకుంటే దిగజారుడు పాలిటిక్స్ సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతా జాగ్రత్తగా ఉండాలి. మరీ ఇది సోషల్ మీడియా యుగం. చీమ చిటుక్కుమన్నా కూడా హైలెట్ అవుతుంది. ఆ మీదట ఎవరికి తోచినది వారు తీర్పులు చెప్పేసి కావాల్సినంత బదనాం చేస్తారు.
అందుకే నాయకులు ఈ టెక్నికల్ యుగంలో బాగా అలెర్ట్ గా ఉండాలి. ఇక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పార్టీ తరఫున చేసిన వారు, మాజీ మంత్రులు నోటితో పాటు తమ చేష్టలను అదుపులో పెట్టుకోవాలి. నేనింతే నేను ఇలాగే ఉంటాను అంటే వారి వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లేటెస్ట్ ఎపిసోడ్ వల్లనే అని చెప్పాలి.
ఆయన ఏలూరు జిల్లాలో టీడీపీకి స్ట్రాంగ్ పిల్లర్ లాంటి వారు. ఆయన దూకుడు రాజకీయం ఒక దశలో హిట్ అయింది కూడా. దేనికీ వెరవని తత్వం చింతమనేనిది. అయితే అధికారంలో టీడీపీ ఉన్నపుడు ఆయన మహిళా అధికారిణి వనజాక్షి విషయంలో ప్రవర్తించిన తీరు ఏపీ వ్యాప్తంగా హైలెట్ అయింది. దాని మీద నాడు విపక్షంలో ఉన్న వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఒక విధంగా చింతమనేని ఒక సీట్లో ఓడారు కానీ ఆ బురద బాగా అంటి టీడీపీ ఇమేజ్ బాగా డ్యామేజి అయిందని, అదే భారీ ఓటమిని దారితీసిందని అన్న విశ్లేషణలూ ఉన్నాయి.
ఇక చింతమనేని విపక్షంలో ఉండగా కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. దాంతో ఆయన మారిపోయారు అని అంతా అనుకున్నారు. ఇక పార్టీ వారు అయితే ఆయన ఇన్ యాక్టివ్ గా ఎందుకు ఉన్నారు అని ఆరా తీశారు. అయితే ఆయన మీద గతంలో ఉన్న కేసులు తవ్వి తీసి వైసీపీ మళ్ళీ ఆయన్ని కార్నర్ చేయడంతో చింతమనేనిలోని అసలు మనిషి బయటకు వచ్చారు. అలా చింతమనేని మళ్ళీ బిగ్ సౌండ్ చేస్తున్నారు. అయితే అధికార పార్టీతో చేసే పోరాటంలో సానుభూతి వస్తుంది. ఇంకా చెప్పాలీ అంటే పార్టీకి మైలేజ్ వస్తుంది.
కానీ చింతమనేని అలా కాకుండా ఇపుడు కోడి పందేల కేసులో ఇరుక్కుని యావత్తు పార్టీని ఇబ్బందుల్లో నెట్టారని కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని పటాన్ చెరు లో జరిగిన కోడి పందేలలో చింతమనేని ప్రభాకర్ ఉన్నారని అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి మీడియా ముఖంగా చెప్తే చింత నిప్పుల్లా కళ్ళు చేసి నేనెక్కడ ఉన్నాను, అంతా రాజకీయం చేస్తున్నారు నన్ను టార్గెట్ చేశారు అంటూ నిప్పులు చెరిగారీ మాజీ ఎమ్మెల్యే.
పైగా ఏపీలో వైసీపీ సర్కార్ మీద కామెంట్స్ చేసి తాను సచ్చీలుడిని అని చెప్పుకున్నారు. అయితే కేసు నమోదు అయింది తెలంగాణాలో. అక్కడ ఉన్నది టీయారెస్. పోనీ అలా అనుకున్నా వైసీపీకి మిత్ర ప్రభుత్వం కాబట్టి ఏమైనా వత్తిళ్ళు పనిచేశాయని అంతా అనుకున్నా తరువాత అయితే ఆయన నాలిక మడతేసారు. దానికి కారణం చింతమనేని పటాన్ చెరు కోడిపందేల వద్ద ఉండడాన్ని వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా పోలీసులు వదిలేసరికి టంగ్ మారింది.
నాకు కోడిపందేలు ఒక వ్యసనం, నేను బెంగుళూరు కూడా వెళ్తాను, ఆట చూస్తాను అంటూ ఏవేవో కబుర్లు చెప్పారు చింతమనేని వారు. అంటే తాను దొరికినా కూడా కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నంలో పలుచన అయ్యారు. పైగా వ్యసనం బలహీనత అంటూ కబుర్లు చెప్పి టీడీపీ లీడర్ గా మాజీ ఎమ్మెల్యేగా తనను తాను తగ్గించుకున్నారు. ఒక వైపు ఏడున్నర పదుల వయసులో పార్టీ కొరకు చంద్రబాబు అలుపెరగకుండా ఎండనకా వాననకా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.
ఆయనకు సహాయంగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ మీద పోరాడాల్సిన లీడర్స్ ఇలా సొంత బలహీనతలు వ్యసనాలు అంటూ కేసులు పెట్టించుకుని గోటితో పోయే దాన్ని గొడ్డలి చేసుకోవడం బురద జల్లించుకోవడం మంచిదేనా అన్న చర్చ వస్తోంది. ఇక మొదట నేను లేను అంటూ బుకాయించి తరువాత ఉన్నాను అని చెప్పిన చింతమనేని తన ఇమేజ్ ని కూడా డౌన్ చేసుకున్నారు అంటున్నారు.
ఇక ఈ కేసు చూస్తే చిన్నది. దాని వల్ల కొంపలేమీ మునిగిపోవు. నేను అక్కడికి వెళ్లాను, ఉన్నాను అని చెబితే పోయేదానికి డొంక తిరుగుడు జవాబులు, సవాళ్ళూ చేసి చివరికి ఇలా చతికిలపడిన చింతమనేనికి తనతో పాటు పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతోందని ఎప్పటికి అర్ధం అవుతుందనే అంటున్నారుట ఇంటా బయటా. మొత్తానికి టీడీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఈ చింత తీరలేదుగా అంటున్నారు మరి.